అన్వేషించండి

YS Sharmila on KCR: ‘దళితబంధుకు ఎమ్మెల్యేలే రాబందులు! KCR మళ్లీ దొంగల చేతికే తాళాలు ఇచ్చారు’

YS Sharmila on KCR: దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన సీఎం కేసీఆర్.. మళ్లీ దొంగలకే తాళాలు అప్పజెప్పాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

YS Sharmila on KCR: దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ దొంగలకే తాళాలు అప్పజెప్పాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని బెదిరించి.. ఎన్నికలకు కావాల్సినంత తినండని మళ్లీ బీఆర్ఎస్ నేతలకే బాధ్యతలు అప్పగించారని ఫైర్ అయ్యారు. అర్హుల ఎంపిక బాధ్యత మరోసారి వాళ్లకే ఇచ్చి.. దళితబంధు పథకాన్ని "కమీషన్ల బంధు" అని చెప్పకనే చెప్పారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తిన్నా 55 కోట్లు వస్తుందని అన్నారు. అలా 100 నియోజక వర్గాలకు లెక్కలు కడితే 6 వేల కోట్లు అవుతుందని.. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు వేల కోట్లు దొచిపెట్టే కుట్ర ఇదంటూ ఫైర్ అయ్యారు. కమీషన్లు కొట్టండి, ఎన్నికల్లో ఖర్చు పెట్టండి అంటూ.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.

పథకం పక్కదారి పట్టిందని, ఎమ్మెల్యేలు పబ్లిక్ గా దోచుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దళితబంధు.. ఎమ్మెల్యేల బంధులా మారిందని అన్నారు. సాక్ష్యాధారాలు బయట పెట్టినా.. దొర తీసుకున్న చర్యలు శూన్యం అని పేర్కొన్నారు. కమీషన్ల కహానీ బయట పెడితే.. దొర అవినీతిపై ఎమ్మెల్యేలే తిరగబడతారని భయం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దళితబంధు ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. గ్రామ సభలో కలెక్టర్ ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరగాలన్నారు. ఆర్థికంగా వెనుక బడిన దళిత బిడ్డలకు పూర్తి స్థాయి పరిహారం అందించాలని వివరించారు. కమిషన్లు అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 

రేపే ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ షర్మిల..! 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో పార్టీలో విలీనంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. రెండు సార్లు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు , విలీన వ్యవహారాలను చూస్తున్న డీకే శివకుమార్ తో సమావేశం కూడా అయ్యారు. అయితే షర్మిల పార్టీ విలీనం చేసినా తెలంగాణలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం ఆమెను ఏపీలో రాజకీయాలు చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ తాను ఏపీలో రాజకీయాలు చేసే ప్రశ్నే లేదని పూర్తి స్థాయిలో తెలంగాణకే పరిమితం అవుతానని అంటున్నారు. 

ఢిల్లీ పర్యటనలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం                                         

షర్మిల ఏపీలో రాజకీయం చేయడానికి అంగీకరిస్తే వెంటనే విలీనం చేయడానికి హైకమాండ్ వెంటనే అంగీకరించే చాన్స్ ఉంది. కానీ ఏపీలో మాత్రం తన సేవలు ఉపయోగించుకోడానికి లేదని.. కేవలం తెలంగాణకు మాత్రమే అంటే.. హైకమాండ్ ఆలోచించే అవకాశం ఉందని అంటున్నరాు.  ఢిల్లీ పర్యటనలో షర్మిల ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget