News
News
వీడియోలు ఆటలు
X

TS Congress : ఓ వైపు చేరికలు - మరో వైపు జంపింగ్‌లు ! టీ కాంగ్రెస్ గాడిన పడేదెప్పుడు ?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత మంది చేరుతూంటే మరికొంత మంది జారుకుంటున్నారు. ఎలాగైనా అధికార పీఠానికి చేరాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్యగా మారింది.

FOLLOW US: 
Share:

TS Congress : కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే పార్టీ. కాంగ్రెస్‌ పార్టీని ఏకతాటిపై తేవడం…నేతలందరినీ ఐక్యమత్యంగా ఉంచడం అంత వీజీ కాదు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇది మరీ ఎక్కువ. తాజాగాతెలంగాణ కాంగ్రెస్‌ లో మరో సీనియర్‌ వికెట్‌ పడిపోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీని వీడిన వారందరినీ మళ్లీ తీసుకురావలని ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు సీనియర్లు ఒక్కొక్కరే జారుకుంటున్నారు. నిన్న విందు రాజకీయాలతో హడావుడి చేసిన సీనియర్లు ఇప్పుడు వీడ్కోలు రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడా లిస్ట్‌ లో ఊహించిన విధంగానే కోమటి రెడ్డి రాజగోపాల్‌ చేరారు.

కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి !

గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటోన్న కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడతారన్న వార్తలు ఉన్నాయి. బీజేపీలోకి చేరాతరని కూడా చెప్పుకున్నారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడిన ఈ పని ఇప్పుడు మళ్లీ మొదలు కాబోతోందట. బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా సమక్షంలో రాజగోపాల్‌ రెడ్డి కాషాయం కండువా కప్పుబోతున్నారని టాక్‌. త్వరలోనే పార్టీ మార్పు ఖాయమంటున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్‌ అధిష్టానం కోమటి బ్రదర్స్‌ కాకుండా రేవంత్‌ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పిందో అప్పటి నుంచే వారు అసహనంతో ఉన్నారు. దీనికి తోడు బైపోల్స్‌, జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ కి ఆదరణ లేకపోవడంతో రేవంత్‌ పనితీరుపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కానీ రేవంత్‌కే ప్రాధాన్యం లభిస్తోంది. 

పాత నేతలను వెనక్కి తెచ్చేందుకు రేవంత్ ప్రయత్నం ! 

ఇంకో వైపు టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డి పార్టీని వీడినవారందరినీ మళ్లీ వెనక్కి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.  పార్టీని వీడి టీఆర్‌ ఎస్‌, బీజేపీల్లో చేరిన నేతలందరినీ మళ్లీ తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు .  ముందు జిల్లాల వారిగా పని మొదలెట్టారు. కింది క్యాడర్‌ నుంచి జిల్లా నేతల వరకు అందరినీ పిలిచి పార్టీలోకి చేరడానికి ఆసక్తి ఉన్నవారిని కలుసుకుంటున్నారట. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లాలో కొంతమంది టీఆర్‌ ఎస్‌ నేతలు తిరిగి కాంగ్రెస్‌ లోకి చేరారు. చేయిని వదలి కారెక్కిన ఆ నేతలకు సరైన గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారట. ఈ సమయంలోనే రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు వారంతా కాంగ్రెస్‌ లో చేరినట్లు తెలుస్తోంది.  ఇలా పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడానికి రేవంత్‌ రెడ్డి చేస్తోన్న ప్రయత్నాలకు పార్టీలోని ఆయన వ్యతిరేకులు బ్రేక్‌ వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.  

అంతర్గత  రాజకీయాలతో కాంగ్రెస్ సతమతం ! 

ఓ వైపు అధికారపార్టీ తిరిగి విజయంసొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు బీజేపీ.. టీఆర్‌ ఎస్‌ కి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఇలా ఆ రెండు పార్టీలు ఎన్నికల వ్యూహాలకు రెడీ అవుతుంటే కాంగ్రెస్‌ మాత్రం ఇంటిపోరుతో రోజురోజుకు చతికలపడుతోందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.    తెలంగాణ తెచ్చింది..ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని చెప్పే నేతలు ఇలా గొడవలు కంటిన్యూ చేస్తే చివరకు పార్టీ తెలంగాణలో కనుమరుగుకావడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు మారాలని క్యాడర్ కోరుకుంటోంది. 

Published at : 22 Jul 2022 05:28 PM (IST) Tags: revanth reddy Telangana Congress Komatireddy Rajagopal Reddy Congress internal politics

సంబంధిత కథనాలు

Delhi Liquor ScaM :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ