News
News
X

Employees Vs AP Governament : ఉద్యోగుల ఉద్యమంతో ఏపీ ప్రభుత్వానికి చిక్కులు - సమస్యను ఎలా పరిష్కరించుకుంటుంది ?

రోడ్డెక్కుతున్న ఉద్యోగులు !

ఆర్థిక వెసులుబాటు లేదంటున్న ప్రభుత్వం !

మా డబ్బులు మాకివ్వాలంటున్న ఉద్యోగ సంఘాలు!

ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా ?

FOLLOW US: 
Share:

Employees Vs AP Governament :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగ సంఘాల నేతలను తీవ్రంగా నిరాశపరుస్తోంది. మొదట్లో అనుకున్నది ఒకటి ఇప్పుడు జరుగుతోంది ఒకటని మధనపడుతున్నారు. సమయాజనికి జీతాలే రావడం లేదు. డీఏలు అసలు ఇవ్వడం లేదు. ఫిట్ మెంట్ తగ్గించిన పీఆర్ఎస్ ఇచ్చారు. తాను దాచుకున్న జీపీఎఫ్‌ను ప్రభుత్వం వాడేసుకుంది. కొన్నాళ్లుగా  సీపీఎస్ కు సంబంధించిన మొత్తమూ చెల్లించడం లేదనే  ఆరోపణలు ఉన్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచారు కాబట్టి రిటైర్మెంట్లు లేవు కానీ వీఆర్ఎస్ తీసుకున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా పని పరమైన అనేక సమస్యలను వారు ప్రభుత్వం  ముందు పెడుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఉన్న సమస్యే నిధులు. మరి ఇప్పుడు ఉద్యోగుల్ని ఎలా కూల్ చేస్తారు? 

డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ముందు పెడుతున్న ఉద్యోగ సంఘాలు

ఉద్యోగ సంఘాల డిమాండ్లు నిజానికి కొత్తవి కాదు. పాత సౌకర్యాలు కల్పించమని.. తాము దాచుకున్న డబ్బులు తమకు ఇవ్వాలని.. సమయానికి జీతాలివ్వాలని కోరుతున్నారు. అలాగే  ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్‌ అంశం సహా  అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నారు. , 13 వేల మందిని రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే పెండింగ్‌ డీఏల చెల్లింపు, సీపీఎస్‌పై ప్రభుత్వ నిర్ణయం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తదితర అంశాలున్నాయి. ఇవికాకుండా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల అంశానికి సంబంధించి ఎన్నికల కోడ్‌ ముగిశాక ఒక డీఏ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ హామీ ఇచ్చింది. సీపీఎస్‌పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.  సీపీఎస్‌ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసులను కూడా మాఫీ చేసేందుకు కమిటీ- అంగీకారం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలపైనా అంగీకారం తెలియజేసింది. వారికి సర్వీస్‌ రూల్స్‌, జాబ్‌ ఛార్ట్‌ సిద్ధం చేస్తామని హామీఇచ్చింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం భూ కేటా తున్న క్రమంలోనే ప్రభుత్వం సీఎస్‌ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో మంగళవారం భేటీ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం !

 మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో ఉద్యోగ సంఘాలతో  చర్చలు ప్రారంభించారు.  ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి వారి సమస్యలపట్ల సానుకూలంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించ బోతోం దన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాటిని గెలిచితీరాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు దిగడం పట్ల ప్రభుత్వ పెద్దలు కూడా వారిపై కొంత అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు గతంలో ఏవైతే డిమాండ్లతో ఉద్యమానికి దిగుతామని ప్రభు త్వానికి చెప్పాయో ఇప్పుడు కూడా అవే డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగిందని అంటున్నారు. వాటిని అమలు చేస్తామని గతంలోనేచెప్పామంటున్నారు.  ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారి సమస్యల పట్ల తాము సానుకూలంగానే ఉంటామని  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

మోసపోయామన్న భావనలో ఉద్యోగులు!

సీఎం గా జగన్ వస్తే సీపీఎస్ రద్దు అవుతుందని.. ఊహించనంత ఫిట్ మెంట్‌తో పీఆర్సీ ఇస్తారని డీఏలు ఆపరని.. ఇలా రకరకాలుగా ఉద్యోగులు ఊహించుకున్నారు. కానీ వాస్తవంగా జరుగుతోంది వేరు. జీతాలే సరిగ్గా రావడం లేదు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించారు. డీఎలు అన్నీ ఆపి ఒక్కసారి ఇచ్చి ఆ లోటును భర్తీ చేశారు. మొత్తంగా తాము మోసపోయామనుకుంటున్నారు. అదే సమయంలో జీపీఎఫ్ లు సహా అనేక ఆర్థిక పరమైన అంశాల్లో ఉద్యోగులు రగిలిపోతున్నారు. అందుకే ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. వీరిని చల్లబర్చాలంటే.. ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. అంత ప్రయోజనాలు కల్పించాడనికి ప్రభుత్వం వద్ద వెసులుబాటు లేదు. ఈ సమస్యను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనేది కీలకం. 

Published at : 08 Mar 2023 05:35 AM (IST) Tags: AP government Trade Unions Bopparaju venkateswarlu CM Jagan

సంబంధిత కథనాలు

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

ఇకనుంచి మనమంతా జనంలోనే ఉండాలి ! – బీఆర్ఎస్ శ్రేణులకు KTR పిలుపు

ఇకనుంచి మనమంతా జనంలోనే ఉండాలి ! – బీఆర్ఎస్ శ్రేణులకు KTR పిలుపు

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

కేసీఆర్ స్పీడుని తట్టుకోలేకనే ప్రతిపక్షాల ఆరోపణలు: బీఆర్ఎస్ నేతలు ఫైర్

కేసీఆర్ స్పీడుని తట్టుకోలేకనే ప్రతిపక్షాల ఆరోపణలు: బీఆర్ఎస్ నేతలు ఫైర్

Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్

Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్

టాప్ స్టోరీస్

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌