Yuva Galam Tension : యవగళం పాదయాత్ర చుట్టూ రాజకీయం ! వైఎస్ఆర్‌సీపీ అడ్డుకుంటుందా ?
లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర చుట్టూ రాజకీయం రాజుకుటోంది. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీపై టీడీపీ మండి పడుతోంది.
Yuva Galam Tension : 27వ తేదీ నుంచి నారా లోకేష్ ప్రారంభించబోతున్న యువగళం పాదయాత్ర విషయంలో ప్రభుత్వం, పోలీసులు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వకపోవడంపై మండి పడుతున్నారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందంటున్నారు.
పాదయాత్రకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న టీడీపీ
ఈ నెల 27నుంచి రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది...40 రోజుల క్రితమే లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి..రాష్ట్రలో ఉన్న వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఫోకస్ చేస్తూ పాదయాత్ర సాగనుందని తెలిపారు..పాదయాత్రకు యువగళం అన్న పేరును ఖరారు చేశారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పాదయాత్ర చేసుకొనేందుకు పోలీసుల ప్రర్మిషన్ కోసం అప్లై చేసినా ఇంత వరకు ఇవ్వకపోవడంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .ప్రజాస్వామ్య యుతంగా చట్టానికి లోబడి పాదయాత్ర చేసుకుంటాము అంటే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.
వివరాలు కావాలని అడిగిన పోలీసులు
పాదయాత్ర కు అనుమతి కావాలంటూ పోలిట్ బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసారు.. స్పందించక పోవడంతో రెండు సార్లు రిమైండర్ కూడా పంపారు. 21 వ తేదిన డీజీపీ స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపారు . ఆ లేఖ చూచి టీడీపీ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నిబందనల పేరుతో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది అంటూ ఏపీ డీజీపీ అధికార పార్టీ తోత్తుగా వ్యవహరిస్తున్నారు ఆంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాదయాత్ర అనుమతి తరువాత ముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మాకు పంపాలి ఆ తర్వాత అనుమతి గురించి ఆలోచిస్తాం అంటూ డీజీపీ కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. అందులో అడిగిన వివరాలు ప్రతిపక్షాల మనుగడకే ప్రమాదంగా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల తీరు కుట్ర పూరితంగా ఉందంటున్న టీడీపీ
400 రోజులపాటు లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు సంబధించి డీజీపీ అడిగిన వివరాలు గతంలో, దేశంలో ఇప్పటి వరకు ఏ పోలీసు అధికారి పాదయాత్రల సమయంలో ఆడగలేదని అంటున్నారు. నాలుగు వందల రోజులకు సంబంధించి ప్రతి రోజు ఎవరెవరు పాదయాత్రలో పాల్గొంటారు..? లోకేష్ ను కలుసుకునే వ్యక్తుల వివరాలు వారి ఆథార్ కార్డు తో సహా సమర్పించాలి అని లేఖలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఉండే వాహన కాన్వాయ్ వివరాలు... వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ తో సహ వివరాలు...రూట్ మ్యాప్ ఏ బజారు నుంచి ప్రారంభమై ఎక్కడ ఆ రోజు ముగుస్తోందో 400 రోజలకు సంబంధించిన వివరాలు... ఏ సమయంలో ఏ ప్రాంతంలో యాత్ర సాగుతోందో తేదీల వారిగా వివరాలు... ప్రతి రోజు బస చేసే ప్రాంతం ..ఎక్కడ నైట్ స్టే అవుతారో తెలియచేస్తూ స్థానికంగా ఆ బాధ్యతలు చూసే వారి ఫోన్ నెంబర్లు అందచేయాలని లేఖలో ప్రస్తావించారు. శనివారం సాయంత్రం మెసెంజర్ ద్వారా లేఖను వర్ల రామయ్య కు అందించి ఆదివారం ఉదయం 11 గంటలలోపు డీజీపీ కార్యాలయాలలో అటెండ్ అయి వివరాలు అందించాలని లేఖలో పేర్కొనడంతో ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ముందే అన్నీ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదన్న టీడీపీ
రూట్ మ్యాప్, రోజు వారి పర్యటన వివరాలు స్థానిక డీఎస్పీ కి అందిస్తామని...ప్రతికూల వాతావరణం, ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు కారణంగా షెడ్యూల్ లో మార్పులుంటాయని చెబుతున్నారు.. డీజీపీ బాద్యత కలిగిన అధికారిగా ప్రవర్తించడం లేదని వైసీపీ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆంటున్నారు. ఈ లేఖ డీజీపీ కార్యాలయం నుంచి వచ్చినట్లు లేదని సకల శాఖా మంత్రి సజ్జల పంపినట్లు ఉందని ఆరోపిస్తున్నారు వర్ల రామయ్య.. పాదయాత్ర లో పాల్గొనే వారి పాన్ కార్డులు, రేషన్ కార్డు, ఆదాయ దృవీకరణ పత్రాలు ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తున్నారు.
యువతను ఆకట్టుకునేందుకు లోకేష్ పాదయాత్ర !
అధికారంలో వచ్చిన తర్వాత యువత సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పిన వైసీపీ ఆ తర్వాత వారిని విస్మరించిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా యువతని టార్గెట్ చేసి వారి సమస్యలను తెలుసు కుంటూ పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్దమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదో ఒక విధంగా పాదయాత్ర జరగకుండా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు..ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్ఠిన పాదయాత్ర ఆగదని, పోలీసుల ఆక్షలు ..అధికార పార్టీ బెదిరింపులుకు భయపడే పరిస్తితి లేదని అంటున్నారు టీడీపీ క్యాడర్.