అన్వేషించండి

Hyderabad Politics : చంపుతారని భయమేస్తోందన్న అక్బరుద్దీన్ - రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ఫైర్ !

Akbaruddin : అక్బరుద్దీన్, రాజాసింగ్ మధ్య రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. తమ సోదరుల్ని చంపేస్తారేమోనని అక్బరుద్దీన్ అంటే దానికి రాజాసింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Akbaruddin Vs Raja Singh : ఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయన్నారు. మా ఇద్దరు బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్‌తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందన్నారు. అయితే తాము ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల అసదుద్దీన్ మాట్లాడుతూ.. కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని.. కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు.                       

తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రచారం ఉందని మండిపడ్డారాయన. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎం పార్టీదన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు ఓవైసీ బ్రదర్స్‌కు ఎక్కడికి పంపించాలనేది డిసైడ్ చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు .                                       

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రచారంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఈ సారి హైదరాబాద్ లో బీజేపీ నుంచి గట్ిట పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఈ సారి సంప్రదాయ రాజకీయ నాయకుల్ని కాకుండా ఓ మహిళా అభ్యర్థిని నిలబెట్టింది. కొంపెల్ల మాధవీలత అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి  పాతబస్తీలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఆమె హిందూత్వ స్టైల్ ప్రసంగాలు .. హిందూ ఓట్లను ఏకం చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వైపు బోగస్ ఓట్ల అంశం కూడా తెరపైకి వచ్చారు.                                  

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరు  లక్షల బోగస్ ఓట్లు ఉంటాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సారి బోగస్ ఓట్లు వేయకుండా కట్టడి చేస్తే.. మజ్లిస్ కు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఓటింగ్ కూడా చాలా  తక్కువగా నమోదవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దగా బయటకు రారు. కానీ వారందరూ వచ్చి ఓటు  హక్కు వినియోగించుకునేలా మాధవీలత ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా మాధవీలతను ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడినందుకు అభినందించారు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ సారి ఓవైసీకి గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్న సమయంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయం ప్రారంభించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget