TRS Office Row : దుమారం రేపుతున్న టీఆర్ఎస్ ఆఫీస్‌కు స్థల కేటాయింపు - ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు !
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన స్థలం కేటాయింప చేసుకోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి.
![TRS Office Row : దుమారం రేపుతున్న టీఆర్ఎస్ ఆఫీస్‌కు స్థల కేటాయింపు - ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు ! Opposition parties are angry over the allocation of the most expensive land in the Banjara Hills for the TRS Hyderabad district office. TRS Office Row : దుమారం రేపుతున్న టీఆర్ఎస్ ఆఫీస్‌కు స్థల కేటాయింపు - ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/39090f9760d68c699726b8588d0222ee_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇతర పార్టీలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అతి దగ్గరనే మరో కార్యాలయం ఎందుకని.. అందు కోసం అత్యంత ఖరీదైన భూమిని ఎలా కేటాయింప చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకత్వం ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించింది. 33 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. జిల్లాల్లోనూ ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే హైదరాబాద్ జిల్లాకు ఇంత వరకూ కేటాయించలేదు. ఇటీవల ఆ పార్టీ దరఖాస్తు చేసుకోవడంతో బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం/గ్రామం, ఎన్బీటీ నగర్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.12 వద్ద సర్వే నంబర్ 18/పీ, 21/పీలో ఈ స్థలం ఉంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ 9న ప్రతిపాదనలు పంపగా 10న సీసీఎల్‌ఏ ఆమోదముద్ర వేసింది.అయితే ఉచితంగా కాదని..ధరను ఖరారు చేసే ప్రక్రియను పెండింగ్‌లో ఉంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. వంద కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉత్తర్వులు వెలుగులోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు.
— Revanth Reddy (@revanth_anumula) May 13, 2022
గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు.
టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది…
ఎవని పాలయిందిరో తెలంగాణ…
జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ!#kcrfailedtelangana pic.twitter.com/UHXldUFVPB
ఈ అంశంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తెరాసా పార్టీ కార్యాలయం నిర్మించడానికి మీకు మీరే కేటాయించుకోడం పై మీ కామెంట్స్ ఎంటి @ktrtrs ?#AnswerKTR
— Telangana Congress (@INCTelangana) May 15, 2022
భారతీయ జనతాపార్టీ నేతలు కూడా ఇవే విమర్శలు చేస్తున్నారు. దళితులకు పంచడానికి లేని భూమి టీఆర్ఎస్ కార్యాలయాలకు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఆ
అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారు. పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. ఇంత విలువైన భూమిని...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 13, 2022
టీఆర్ఎస్ ఆఫీస్‌కు స్థల కేటాయింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. దీంతో ఇతర పార్టీల నేతలు మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. త్వరలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలనే ఆలోచనలో ఇతర పార్టీలు ఉన్నాయి. ఎక్కువ కాలం మౌనంగా ఉండలేమని.. దీనిపై సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)