KCR : బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందే - కశ్మీర్ ఫైల్స్ వదిలి పెట్టి ప్రజాసమస్యలు చూడాలి : కేసీఆర్

బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ మరింత కాలం ఉంటే దిశం మరింత దిగజారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

FOLLOW US: 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పై విరుచుకుపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో సాంకేతికంగా గెలిచామని బీజేపీ అనుకోవచ్చు కానీ.. బలం తగ్గిపోయిందన్నారు .బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయింది.   యూపీఏ బాగాలేదని ప్రజలు తీసేసి బీజేపీకి అధికారం ఇస్తే ఇప్పుడు పరిస్థితులు మరింతగా దిగజారాయి. జీడీపీ భారీగా పడిపోయింది. నిరుద్యోగిత పెరిగిపోయింది.  మాకు ఇంతే వస్తుంది ఇంతకు మించి చేతకాదని చెప్పకనే చెప్పారని కేసీఆర్ తేల్చేశారు. 

కశ్మీర్ ఫైల్స్‌తో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ! 

 సోషల్ మీడియా ద్వారా  ది కశ్మీర్‌ ఫైల్స్‌ తో దుష్ప్రచారం నిర్వహిస్తున్నారని కేసీఆర్ విమర్సించారు.  పండిట్స్‌ కూడా దీన్ని హర్షించడం లేదన్నారు. తమకు జరిగిందాన్ని ఓట్లుగా మారుస్తున్నారని... ఇలాంటివి తెలంగాణలో సాధ్యం కావని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విచ్ఛినమైన స్లోగన్స్‌ తీసుకోలేదనిగుర్తుచేశాు. మంచి వాతావరణం ఉంటే కదా ఐటీ లాంటివి వృద్ధి అయ్యేదని ప్రశ్నించారు. కరోనా, ఉక్రెయిన్ వంటి విషయాల్లో కేంద్రం ఘోరంగా విఫలమయిందన్నారు. హ్యాపీ ఇండెక్స్‌లో భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే తక్కువగా ఉండటం ఘోరం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ ర్యాంకింగ్‌లో సిరియా కంటే కింద ఉన్నామన్నారు.  బీజేపీ  తీసుకొచ్చిన దుర్మార్గాలను, కశ్మీర్ ఫైల్స్‌ లాంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు. 

ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేదు ! 

బీజేపీ ఇచ్చిన హామీలను  ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని కేసీఆర్ విమర్శించారు. రిజర్వేషన్ల వ్యవహారంలో యాభైశాతం కంటే ఎక్కువ వద్దని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అందులో వెసులుబాటు ఉంది. ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి వస్తే మార్చుకోవచ్చని చెప్పింది. శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. గిరిజన రిజర్వేషన్ పెంచుకోవాలని పంపించాం. ఇప్పటి వరకు ఉలుకు పలుకూ లేదు. ఎస్సీ వర్గీకరణలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం. దానిపై కూడా అతీ గతీ లేదు. బీసీల కులగణన చేయమని చెబితే పట్టించుకోలేదు.  ఇదే ప్రభుత్వం కొనసాగితే దేశం మరింత దిగజారుతుందనికేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

  చేతులెత్తి వేడుకుంటున్నాం.. తెలంగాణతో పెట్టుకోండి !

చేతులెత్తి సమస్కరించి ప్రధానిని వేడుకుంటున్నాం. దయచేసి తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి... మీరు మాయామశ్చింద్ర చేస్తామని భ్రమలో ఉండొద్దని ప్రధాని మోదీకి కేసీఆర్ సూచించారు.  పంజాబ్‌కు అవలంభించే విధానం తెలంగాణకు అమలు చేయాలన్నారు.  మెలికలు పెడితే మాత్రం తెలంగాణ ఆగ్రహానికి గురి అవుతారని హెచ్చరించారు.  దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగ బద్దమైన విధి నుంచి ఎస్కేప్ కావద్దు. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు. ఇంకోసారి కరవో కాటకమో వస్తే దేశానికి అన్నం పెట్టే స్థితిలో ఉండాలన్నారు. లేకుంటే ఏ దేశం కూడా భారత్‌ దేశానికి వారం అన్నం పెట్టే పరిస్థితి లేదన్నారు. దీన్ని అధిగమించేందుకు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలని సూచించారు.   అన్ని రాష్ట్రాల సీఎంలను పిలవండి మాట్లాడాలని.. దాని కోసం చేయాల్సిన హెల్ప్ మేం కూడా చేస్తామని కేసీఆర్ సూచించారు. 

అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఉద్యమాలు !

జాతీయ స్థాయిలో ధాన్య సేకరణ విధానం ఉండాలి. దీని వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అలా చేయకుంటేే మాత్రం అనేక పోరాటాల రూపంలో ఉద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  అవసరమైతే దిల్లీ వెళ్లి ఉద్యమాలు చేస్తామన్నారు. ఇటీవల కిసాన్ ఉద్యమ నేతలు కలిశారని జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు రాజ్యాంగ బద్ధమైన రక్షణ లేదు. ఇది ఇప్పుడు అవసరం వచ్చింది. మా పార్టీ తరఫున దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎంఎస్‌పీ, సేకరణ, ఇలా ప్రతి దానికి రాజ్యాంగ రక్షణ కావాలి. మీదే నిజమైనా రైతు ప్రభుత్వమైతే కచ్చితంగా రైతుకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 

Published at : 21 Mar 2022 05:35 PM (IST) Tags: BJP cm kcr trs Prime Minister Modi

సంబంధిత కథనాలు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule : యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !

3 Years of YSR Congress Party Rule :   యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో  జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !

3 Years of YSR Congress Party Rule : దూరమైన ఫ్యామిలీ, ఆత్మీయులు - మూడేళ్లలో జగన్ కొత్త శత్రువులను పెంచుకున్నారా ?

3 Years of YSR Congress Party Rule : దూరమైన ఫ్యామిలీ, ఆత్మీయులు - మూడేళ్లలో జగన్ కొత్త శత్రువులను పెంచుకున్నారా ?

టాప్ స్టోరీస్

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!