అన్వేషించండి

Muddaraboina: 'టీడీపీకి రాజీనామా చేస్తున్నా, వైసీపీలో చేరలేదు' - త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

AP Politics: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. నూజివీడు పార్టీ ఇంఛార్జీగా కొలుసు పార్థసారథిని నియమించిన నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.

Muddaraboina Venkateswarao Resigned To Tdp: ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు (Nuzividu) నియోజకవర్గం ఇంఛార్జీగా నియమించడంతో.. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (Muddaraboina Venkateswararao) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో తన కార్యాలయంలో ఉన్న టీడీపీ పోస్టర్లను తొలగించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, తాను వైసీపీలోనూ చేరలేదని.. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. పార్టీ నూజివీడు ఇంఛార్జీగా ప్రకటించారని.. మీకు, మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మండిపడ్డారు.

'పని చేసినా గుర్తింపు లేదు'

ఉరిశిక్ష వేసే ముందు కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరికను అడుగుతారని.. కానీ కనీసం పార్టీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని ముద్దరబోయిన ఆవేదన వ్యక్తం చేశారు. 'వైసీపీలో చేరినట్లు నేనేమైనా చెప్పానా.?. సీఎంవోలో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించాను. సీఎంను ఎవరైనా కలవొచ్చు కదా?. పదేళ్లు నన్ను వాడుకొని బయటకు గెంటేశారు. నూజివీడులో చచ్చిపోయిన పార్టీని బతికించాను. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా పని చేశాను. పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీ చేయాలని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ సీటిచ్చారు. మరి ఈ రోజు నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.' అని వాపోయారు.

కాగా, 2024 ఎన్నికల్లో పెనమలూరు టికెట్ కొలుసు పార్థసారథికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన సైకిల్ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పెనమలూరు నుంచి పార్థసారథి అభ్యర్థిత్వంపై సర్వే సైతం నిర్వహించారు. అయితే, ఇక్కడి టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో పార్థసారథిని నూజివీడు నుంచి బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే పార్థసారథి సైతం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన అనుచరుల సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది. 

టీడీపీ ఇంఛార్జీగా పార్థసారథి 

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సీఎం జగన్ ను కలిసిన నేపథ్యంలో.. కొలుసు పార్థసారథిని నూజివీడు టీడీపీ ఇంఛార్జీగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెనువెంటనే ముద్దరబోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలకు అవి దక్కకపోవడంతో పార్టీలు మారుతున్నారు. దీంతో ఈసారి పొలిటికల్ వార్ అత్యంత ఆసక్తికరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: 'వస్తే ఒకటి, రాకపోతే రెండు నమస్కారాలు' - జనసేనాని పవన్ కల్యాణ్ పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
MLA Madhavi Reddy: 'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Royal Enfield Bear 650: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
IND vs AUS Test Series: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP DesamUsha Chilukuri vs Kamala Harris |  Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP DesamUsha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
MLA Madhavi Reddy: 'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Royal Enfield Bear 650: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
IND vs AUS Test Series: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Second Hand Car Buying Guide: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
Vizag News: విశాఖ వాసి టాలెంట్- చిరుధాన్యాలతో డొనాల్డ్ ట్రంప్ చిత్రపటం
విశాఖ వాసి టాలెంట్- చిరుధాన్యాలతో డొనాల్డ్ ట్రంప్ చిత్రపటం
Embed widget