News
News
X

Movie Politics : సినిమాలతో రాజకీయం మార్చేయవచ్చా ? ఏపీ రాజకీయ పార్టీలూ ఏ అవకాశాన్నీ వదలడం లేదా ?

ఏపీ రాజకీయాలను మార్చడానికి సినిమాలు కూడా రెడీ అవబోతున్నాయి. సీఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ తర్వాత రాజకీయం సినిమాల వైపు చూస్తోంది.

FOLLOW US: 

Movie Politics :   ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఏడాదిన్నర తర్వాత వస్తాయి. కానీ రాజకీయ పార్టీలు అన్ని వైపుల నుంచి విజయం కోసం ఏం చేయాలి.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేయాలి అన్నదానిపై విస్తృతంగా మేధోమథనాలు నిర్వహిస్తున్నారు. ఇతర విషయాలన్నింటినీ పక్కన పెడితే రాజకీయ పార్టీల దృష్టి సినిమాలపై కూడా పడింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్‌తో సీక్రెట్ భేటీ నిర్వహించడం... వెంటనే రెండు, మూడు సినిమాల రూపకల్పనకు  సన్నాహాలు జరిగిపోయాయని ప్రచారం కావడంతో ఏం  సినిమాలు తీయబోతున్నారు ? వ్యతిరేకంగానా ? అనుకూలంగానా ? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. 

వివాదాస్పద సినిమాలు తీయడంలో దిట్ట ఆర్జీవీ 

రామ్ గోపాల్ వర్మ తాను ఏదనుకుంటే అది చేస్తారు. ఇతరులు ఏమనుకుంటారోనని పట్టించుకోరు.  గతంలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా టార్గెట్ చేశారు. ఎన్నికలను గురి పెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఉన్న విషయాల కంటే ఆ సినిమా గురించిన జరిగిన చర్చ వల్లే టీడీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు తీయాలనుకుంటే ఆయన తీస్తూనే ఉంటారు. పెట్టుబడి పెట్టే వాళ్లు కావాలి. అలాంటి పెట్టుబడులు పెట్టడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. గతంలోనే ఆయన కొన్ని వివాదాస్పదసి నిమాలు ప్రకటించారు. కానీ తెర మీదకు రాలేదు. వివిధ కారణాలతో ఆగిపోయాయి. అయితే ఇప్పుడు లక్ష్యం లాభాలు కాదు కాబట్టి..  పెట్టుబడికి సమస్య ఉండదు. ఆర్జీవీ తీయాలనుకున్న సినిమాలు తీస్తారు. 

జగన్‌కు ఎలివేషన్ ఇచ్చే సినిమాలు ప్లాన్ చేశారా ? 

News Reels

ఆర్జీవీతో వైఎస్ఆర్‌సీపీ తీయించే సినిమాలు ఎలాంటివి  అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ ను ఎలివేట్ చేసేలా .. ఆయనను ప్రజా నాయకుడిగా ఉన్న ఇమేజ్ ను మరింత పెంచేలా సినిమా తీయాలన్న సూచనలు ఆర్జీవీకి వెళ్లాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికలకు ముందు మహి వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా చేశారు. అయితే అది పూర్తిగా వైఎస్ రాజశేెఖర్ రెడ్డి సినిమా. అందులో జగన్ పాత్ర లేదు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ప్రస్థానం గురించి.. సినిమా తీయాలని ఆర్జీవీని కోరినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు విడుదలయ్యేలా రెడీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. 

వంగవీటి రంగా హత్య ఇష్యూపై సినిమాను రెడీ చేస్తున్నారా ? 

అయితే ఆర్జీవీ అలాంటి సినిమాలు తీసే దర్శకుడు కాదు. ఆయన ది పూర్తిగా నెగెటివ్ ధింకింగ్ సినిమాలు. అంటే కాంట్రావర్శి ఉండేవే తీసుకుంటారు. ఈ ప్రకారం ఆయన అభిరుచికి తగ్గట్లుగా వంగవీటి రంగా హత్య అంశాన్ని సినిమాగా తీయవచ్చన్న ప్రచారం ఉంది. పవన్ కల్యాణ్‌పై సందర్భం వచ్చినప్పుడల్లా విరుచుకుపడే ఆర్జీవీ.. అలాంటి చాన్స్ వస్తే వదులుకోరని అంటున్నారు. వంగవీటి రంగా విషయంలో ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. గతంలో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే టాపిక్‌పై సినిమా తీయమని సూచనలు అందుకున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఉండనున్న తరుణంలో ఆ సినిమా రాజకీయ లక్ష్యాన్ని గురి పెట్టినట్లుగా ఉంటుందని చెబుతున్నారు. 

టీడీపీ కూడా పోటీ సినిమాలు తీయిస్తుందా ?

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇలా సినిమాలు తీయిస్తూంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు ఊరుకునే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. టీడీపీకి సినిమా ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నాయి. తీయదల్చుకుంటే ఎలాంటి సినిమాలైనా తీయించగలుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదంటున్నారు. 

Published at : 27 Oct 2022 12:44 AM (IST) Tags: Ram Gopal Varma AP Politics CM Jagan Movies - Politics

సంబంధిత కథనాలు

Ganta In YSRCP :  వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

Ganta In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే- ఇప్పటం బాధితులకు పరిహారం పంపీణి పవన్ రెడీ

ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే- ఇప్పటం బాధితులకు పరిహారం పంపీణి పవన్ రెడీ

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి