Jaggareddy : టీ కాంగ్రెస్‌లో యశ్వంత్ సిన్హా చిచ్చు - భట్టి విక్రమార్కపై జగ్గారెడ్డి ఆగ్రహం !
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై ఎమెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. యశ్వంత్ సిన్హాను కలిసి ఎందుకు మద్దతు ప్రకటించలేదో చెప్పాలన్నారు.
Jaggareddy : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణకు వస్తే ఒక్క టీఆర్ఎస్ మాత్రమే యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కలవడం లేదు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. యశ్వంత్ సిన్హాను ఎందుకు కలవరని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని జగ్గారెడ్ ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానం తో మాట్లాడి సీఎల్పీ కి ఆహ్వానించేది ఉండాల్సిందని.. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ తీరు తెలుగుజాతికి అవమానం - ప్రధానికి స్వాగతం చెప్పకపోవడంపై ఏపీ బీజేపీ ఫైర్ !
యూపీఏలో టీఆరెస్- ఎంఐఎం భాగ్యస్వామ్యం కాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని టీఆరెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ పక్షాన మనం కూడా యశ్వంత్ సిన్హా ని ఆహ్వహించాల్సి ఉందన్నారు. రాజకీయంగా రెండు పార్టీ లు వేరు వేరు….సిద్ధాంతాపరంగా ,ప్రజా సమస్యల పై సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ ని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో లేని టీఆరెస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని సీ ఎల్పీ కి పిలిపించి సీఎల్పీ మద్దతు పలికాల్సిందన్నారు. దీనిపై పూర్తిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని తప్పు పడుతూ ఢిల్లీ కి లేఖ రాస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.
2 రోజులు, 2 దెబ్బలు - హైదరాబాద్ వేదికగా బీజేపీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తుందంటే !
అయితే చివరి క్షణంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. కేసీఆర్ తో కలిసిన తరువాత తమను కలుస్తున్నారని.. తాము అందుకు అంగీకరించేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ నాయకత్వానికి స్పష్టం చేశామని రేవంత్ వెల్లడించారు. జగ్గారెడ్డి వ్యక్తిగతంగా కలిసేందుకు సిన్హాను అప్పాయింట్ మెంట్ కోరారు. ఆయన సమయం ఇస్తే కలిసి మద్దతు ప్రకటిస్తానన్నారు.
జగ్గారెడ్డి అసంతృప్తి అంతా రేవంత్ రెడ్డిపైనేనని.. అయితే గతంలో రేవంత్ పై పలుమార్లు విమర్శలు చేసిన అంశం మిస్ ఫైర్ కావడంతో ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క పేరు చెప్పి రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించినా తెలంగాణలో కలవకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డేనని జగ్గారెడ్డికి తెలుసని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.