By: ABP Desam | Updated at : 05 Feb 2022 03:59 PM (IST)
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కలెక్టర్‌కు బాలకృష్ణ వినతిపత్రం
హిందూపురం జిల్లా కోసం నందమూరి బాలకృష్ణ పోరాటం ముమ్మరం చేశారు. శుక్రవారం మౌనదీక్ష చేసిన ఆయన శనివారం హిందూపురం నుంచి భారీ ర్యాలీగా అనంతపురం జిల్లాకు వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అందుకోసం తాను దేనికైనా సిద్ధమేనన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉందన్నారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోవాలని.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు.
ఏపీ ఉద్యోగులు కోరుతున్నదేంటి? ప్రభుత్వం ఇస్తానంటున్నదేంటి? వివాదానికి ఈ రోజు తెరపడేనా ?
ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతానికి జిల్లా కేంద్రం కావాలని.. లేకపోతే తమ ప్రాంతాన్ని ఫలానా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగుతున్నారు. కొన్ని చోట్ల జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం... మరికొన్ని చోట్ల జిల్లాలు మారితే ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఎక్కువ మంది వ్యతిరేకత చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. ప్రభుత్వాలు ఎప్పుడు జిల్లాల ప్రకటన చేసినా హిందూపురం జిల్లా ఉంటుందనుకున్నారు.
ఏపీ వ్యాప్తంగా ఉద్యోగుల సహాయనిరాకరణ.. ఎక్కడివక్కడ నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు !
ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాయి. పార్టీలకు అతీతంగా జిల్లా కోసం ఉద్యమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నెల రోజుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా మార్చకపోతే తదుపరి కార్యాచరణను నందమూరి బాలకృష్ణ చేపట్టే అవకాశం ఉంది.
మునుగోడులో ఎవరి బలం ఎంత- ఈ సారి ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు?
Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం
KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !
Addanki Dayakar : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ - అద్దంకి దయాకర్‌పై చర్యలకు సీనియర్ల డిమాండ్ !
TDP - National Flag: "డీపీ"లు మార్చేసిన టీడీపీ - అంతా త్రివర్ణ పతాకమే !
Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?
హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైస్టార్ హోటల్లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు
Nellore News : రోడ్డు కోసం నిలదీసిన జనం, నోరు మూసుకోమని సమాధానమిచ్చిన ఎమ్మెల్యే
Indian Special Forces: ఈ ప్రత్యేక దళాల గురించి తెలుసా? వీటిని ఢీ కొట్టే సత్తా దేనికీ లేదు!