Botsa Assets: భారీగా పెరిగిన మంత్రి బొత్స కుటుంబ ఆస్తులు, కేవలం ఐదేళ్లలోనే రెండు రెట్లు పెరిగిన విలువ
Botsa Affidavit: మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తులు విలువ భారీగా పెరిగాయి. ఐదేళ్లలోనే రెండురెట్లు దాటాయి. కేవలం కుటుంబ సభ్యుల వద్ద తీసుకున్న అప్పులు మాత్రమే ఉన్నాయి.
Botsa Nomination: విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ(YCP) అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. గత ఎన్నికల సమయంలో రూ.8.23 కోట్ల ఆస్తి మాత్రమే ఉన్న బొత్స కుటుంబానికి ప్రస్తుతం 21.19 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
పెరిగిన ఆస్తులు
వైసీపీ(YCP) ప్రభుత్వంలో కీలక మంత్రి...విజయనగరం జిల్లాలో కీలక నేతగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ కుటుంబం ఆస్తుల విలువ గణనీయంగా రెండు రెట్లు పెరిగింది. గత ఎన్నికలకు ముందు కనీసం పదికోట్లు కూడా లేని ఆయన ఆస్తి ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు దాటిపోయింది. ఇదంతా కేవలం అఫిషియల్ లెక్కలు మాత్రమే. చీపురపల్లి(Chepurupalli) నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ పేరిట చరాస్తులు రూ.3.78 కోట్లు ఉండగా... ఆయన భార్య ఝాన్సీలక్ష్మి(Jhansi Lakshimi) పేరిట చరాస్తి రూ.4.75 కోట్లు ఉంది. అలాగే అవిభక్త కుటుంబానికి రూ.35.04 లక్షల ఆస్తి ఉంది. స్థిరాస్తుల పరంగా బొత్స పేరిట రూ.6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో మరో రూ.4.46 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవిగాక కుటుంబ సభ్యుల పేరిట మరో రూ.1.08 కోట్ల విలువైనవి ఉన్నాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారమే. మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.21.19 కోట్లు.
గతంలో బొత్స సోదరుల ఆస్తులు
2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఆస్తులు ఎనిమిదిన్నర కోట్లు ఉండగా...అప్పులు కోటిన్నర వరకు ఉన్నాయి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న బొత్స...పలుమార్లు మంత్రిగా పనిచేశారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బంగారం, కార్లు, విలువ మొత్తం కలిపి 3కోట్ల 60 లక్షల వరకు ఉంది. వ్యవసాయ భూమితోపాటు విజయనగరం(Vizianagaram) చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్లాట్లు కొనుగోలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో మార్కెట్ విలువ తెలిపారు కానీ...ఇప్పుడు అక్కడ వాస్తవ విలువ చాలా ఎక్కువే ఉండి ఉంటుంది. అలాగే కమర్షియల్ బిల్డింగ్‌లు, ఇల్లు కలిపి మొత్తం విలువ 4 కోట్ల 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అఫిడవిట్‌లో చూపారు. మొత్తంగా మంత్రి బొత్ససత్యనారాయణ ఆస్తులు విలువ 8.5 కోట్లు ఉన్నాయి.ఆయన, కుటుంబ సభ్యుల పేరిట వివిధ కంపెనీల పేరిట తీసుకున్న అప్పు కోటీ 45 లక్షల వరకు ఉంటుందని లెక్కల్లో చూపారు. ఇక ఆయన తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య(Appalanarasaiaha) విషయానికి వస్తే 5 కోట్ల 28 లక్షల విలువైన ఆస్తులు, 23 లక్షల అప్పులు ఉన్నాయి.డిపాజిట్లు, బంగారం, వాహనాల విలువ మొత్తం కలిపి కోటీ 80 లక్షల వరకు ఉండగా...వ్యవసాయ భూములు, ఇల్లు, ప్లాట్లు, కలిపి మరో మూడున్నర కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పు రూ. 23లక్షల వరకు ఉంది.
బొత్స కుటుంబం అప్పులు-కేసులు
బొత్స సత్యనారాయణ కుటుంబం మొత్తం అప్పులు రూ.4.24 కోట్లు ఉన్నాయి. అయితే ఈ అప్పు మొత్తం కూడా కుటుంబ సభ్యుల వద్దే తీసుకున్నారు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న బొత్స కుటుంబ సభ్యులపై ఎలాంటి కేసులు లేకపోవడం విశేషం.