అన్వేషించండి

Lokesh Sakshi : ఆ పత్రిక నుంచి రూ. 75 కోట్లు డిమాండ్ చేస్తున్న లోకేష్ ! గురువారం విశాఖకు...

తనపై తప్పుడు వార్తలు రాసినందున 75కోట్లు చెల్లించాలని ఓ దినపత్రికపై లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు గురువారం విశాఖ వెళ్లనున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) గురువారం విశాఖ కోర్టుకు ( Vizag Court ) హాజరుకానున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక ( News Paper )  పై లోకేష్ రూ.75 కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో ( Vizag Air port ) లోకేష్ ప్రజాధనం తో  రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ లోకేష్ వివరణ ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. ఆ వార్తను ప్రచురించిన కొన్ని పత్రికలు క్షమాపణలు చెప్పాయి. 

సంపాదించకుండా ఖర్చు పెడితే దివాలానే - ఏపీనే సాక్ష్యమన్న బీజేపీ ! జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

అయితే ఓ తెలుగు ప్రముఖ దినపత్రిక ( Telugu News Paper ) మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించింది. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.  రూ. 75 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి  విశాఖ కోర్టుకు లోకేష్ ( Vizag ) స్వయంగా హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.ఆ పత్రిక ఏపీ అధికార పార్టీకి ( Ruling Party ) సంబంధించిన వారిది కావడంతో ప్రత్యేకంగా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని ఎన్నో కథనాలు రాస్తోందని అలా వదిలేస్తే పెద్ద ఎత్తున అసత్య కథనాలతో విరుచుకుపడుతుందని అందుకే న్యాయపోరాటం ద్వారా బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నామని టీడీపీ ( TDP ) వర్గాలు చెబుతున్నాయి. 

వివేకా కేసులో ఎన్నెన్ని మలుపులో ! కొత్త ట్విస్టులు మామూలుగా లేవు..

ఈ కేసు విచాణరకు ఆ పత్రిక ప్రతినిధులు హాజరవుతారో లేదో స్పష్టత లేదు. కానీ అయితే క్షమాపణ చెప్పాలి లేకపోతే నష్టపరిహారం చెల్లించాలన్న పట్టుదలగా లోకేష్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ పత్రిక రాసిన కథనం తప్పు అని పూర్తి డాక్యుమెంట్లతో టీడీపీ నేతలు ఇప్పటికే ఆ వార్త రాసిన పత్రికలన్నింటికీ పంపారు. దీంతో వార్త ప్రచురించిన వారు క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో న్యాయపోరాటం ద్వారా ఆ పత్రికతో క్షమాపణలు అయినా చెప్పించుకోవడం లేదా నష్టపరిహారం అయినా వసూలు చేయడం ఖాయమని లోకేష్ సన్నిహితులు ధీమాతో ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Embed widget