Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగింపు దశకు ఎన్నికల ప్రచారం, ఆఖరి రోజు ఎవరు ఎక్కడ ప్రచారం చేయనున్నారు?
Last Day Election Campaign: ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం ఆరు గంటలతో ముగియనుంది. దీంతో కీలకమైన నియోజక వర్గాల్లో అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు.
![Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగింపు దశకు ఎన్నికల ప్రచారం, ఆఖరి రోజు ఎవరు ఎక్కడ ప్రచారం చేయనున్నారు? Last day of the Election Campaign in Andhra Pradesh And Telangana top Leaders Participated in Various Assembly Constituencies Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగింపు దశకు ఎన్నికల ప్రచారం, ఆఖరి రోజు ఎవరు ఎక్కడ ప్రచారం చేయనున్నారు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/11/5c8b69074dfee12f24c3b219bb022be41715411262145215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh And Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. జాతీయపార్టీల ఆగ్రనేతలు సహా...రాష్ట్రనేతలు చివరిరోజు విస్తృతంగా పర్యటనలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రజలకు చివరిసారిగా తమ హామీల చిట్టా వినిపించనున్నారు..
తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు
దేశంలో మూడోసారి అధికారపీఠం ఎక్కడంతోపాటు 400 సీట్లపై కన్నేసిన అధికార బీజేపీ(BJP)....తెలుగురాష్ట్రాలపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. తెలంగాణ(Telangana)లో సొంతంగా పోటీ చేస్తుండగా ఏపీ(Andhra Pradesh)లో కూటమిగా జట్టు కట్టింది. మెజార్టీ స్థానాలు ఇక్కడి నుంచి తమ ఖాతాలో వేసుకునేందుకు ఆపార్టీ అగ్రనేతలు దృష్టిపెట్టారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) సహా హోంమంత్రి అమిత్‌షా(Amithsha) రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. ఇక ఎన్నికల ప్రచారం చివరిరోజు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా..తిరుపతి(Tirupathi) లోక్‌సభ, ఆదోని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తున్నారు. భీమవరం(Bhimavaram) రోడ్‌షోలో కేంద్రమంత్రి వీకేసింగ్ పాల్గొననున్నారు. విజయవాడ పశ్చిమలో ఆపార్టీ నేత షాన్‌వాజ్ హుస్సేన్ ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సైతం కడప బహిరంగ సభకు హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila) కడప ఎంపీగా పోటీ చేస్తుండటంతో చివరిరోజు ఆమె తరఫున రాహుల్ ప్రచారంలో పాల్గొననున్నారు. మరో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తెలంగాణలోని తాండూరులో నిర్వహించనున్న జనజాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం కామారెడ్డిలో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఆమెతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సైతం ఆయా సభలకు హాజరుకానున్నారు.
చివరి రోజు జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరింది. విశ్రాంతి, విరామం లేకుండా బహిరంగ సభల్లో పాల్గొంటున్న నేతలకు నేటి నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగించాల్సి ఉండటంతో వివిధ పార్టీల నేతలక కీలక నియోజకవర్గాలపై దృష్టిసారించారు. వైసీపీ అధినేత జగన్(Jagan) నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. పవన్‌కల్యాణ్(Pawan Kalyan) పోటీచేయనున్న పిఠాపురంలో చివరిరోజు సీఎం బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం ఆయన పిఠాపురం రానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పవన్‌పై పదేపదే వ్యక్తిగత ధూషణలకు దిగే జగన్....పిఠాపురం సభలో ఏం మాట్లాడనున్నారన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతకన్నా ముందు ఆయన చిలకలూరిపేట, కైకలూరు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు.
చంద్రబాబు(Chandra Babu) సైతం ప్రజాగళం సభలతో విరామం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు నంద్యాల, చిత్తూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. చిత్తూరులో చివరి సభలో పాల్గొన్న అనంతరం అటు నుంచి అటే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.రాష్ట్రంలో కూటమి గెలుపు కోసం వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు కోరనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 114నియోజకవర్గాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రజాగళం పేరిటే 90 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించారు.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చివరిరోజు కాకినాడ అర్బన్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు 50కు పైగా నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తిరుపతిలో భాజపా అగ్రనేత జేపీనడ్డాతో కలిసి లోకేశ్(Lokesh), జనసేన నేత నాగేంద్రబాబు రోడ్‌షోలో పాల్గొననున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)