YS Sharmila : ఏపీలో మాఫియా రాజ్యం - కర్నూలులో షర్మిల ఫైర్
Andhra News : ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందని కర్నూలులో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయ్ యాత్రలో భాగంగా విస్తృతంగా ప్రచారం చేశారు.
Andhra Politics : ఏపీ లో మద్యం మాఫియా,మట్టి మాఫీయా,ఇసుక మాఫియా దోచుకుంటుందని షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. ఆలూరులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ న్యాయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆలూరులో ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికి వస్తాడన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
రాష్ట్రంను మద్యం, మట్టి, ఇసుక మాఫియా దోచుకుంటుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంకు ప్రత్యేక హోదా ను తెస్తామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పేదింటి మహిళకు కుటుంబం గడిచేందుకు నెలకి రూ .8230 చొప్పున ఏడాదికి లక్ష, ఐదేళ్లకు ఐదు లక్షలు ఇస్తామన్నారు.ఉపాధి హామీ కూలీలకు రోజుకి రూ.400 కూలీ వచ్చేలా పనులు కల్పిస్తామన్నారు. పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యి అందించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.
వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చారని, , కానీ ఈ ఐదేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడింది లేదన్నారు. 2008లో వేదవతికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శిలాఫలకం వేసిన విషయంలో ఆమె గుర్తు చేశారు. అదే ప్రాజెక్ట్ కి జగన్ మరో శిలాఫలకం వేశారని చురకలు అంటించారు. జగన్ ప్రభుత్వం శిలాఫలకం వేసే కన్నా .. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి ఉంటే సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రైతు కుటుంబాలు వీటివల్ల బాగుపడేవన్నారు. ఆలూరు నియోజక వర్గంలో టమాటా ఎక్కువ పండుతుంది, రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు.. కానీ నేటి వరకు కట్టకపోవడంపై షర్మిల మండిపడ్డారు. ఇది టమోటా రైతులను వంచించడమే అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వంకు కనబడటం లేదన్నారు. ధర ల స్థిరీకరణ నిధి అని చెప్పి ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని షర్మిల నిప్పులు చెరిగారు. రైతును దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ రాజును చేశాడు, కానీ నేడు రైతు అప్పుల పాలు అయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కారణం నీటి ఎందుకు కారణం నేటి ప్రభుత్వ అసమర్థ పాలననే అన్నారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయ వద్దని ఆమె ప్రజలను కోరారు. మీ ఓటు వృధా కానివ్వొద్దని ప్రజలకు ఆమె విన్నవించారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీ లో వేసినట్లే, ఈ సారి ఆలోచన చేసి ఓటు వేయండని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఏడాదిలోనే 2.25 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆలూరు కాంగ్రెస్ అభ్యర్థి, అరికట్ల నవీన్ కిషోర్, కర్నూలు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రాంపులయ్య యాదవ్ ను గెలిపించాలని కోరారు .