అన్వేషించండి

KTR Vs Revanth Reddy Debate 2026: డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?

Telangana Debts White Paper Assembly: తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. చర్చలకు రెడీ అని ఇరుపక్షాలంటున్నాయి. మరి నిజంగా ప్రజల ముందు చర్చిస్తారా?

BRS Congress Political Showdown:   "దమ్ముంటే చర్చకు రా.. నువ్వు వస్తావో.. నన్ను రమ్మంటావో తేల్చుకో!"—తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట వినిపించే అత్యంత పాపులర్ డైలాగ్ ఇది. సవాల్ విసిరే వారు, దాన్ని స్వీకరించే వారు మైకుల ముందు చూపే రౌద్రం చూస్తే.. నిజంగానే ఇరుపక్షాలూ కూర్చుని తేల్చేసుకుంటాయేమో అని సామాన్యులు భావిస్తుంటారు. కానీ,  ఇలాంటి పొలిటికల్ ఛాలెంజ్‌లలో ఒక్కటంటే ఒక్కటి కూడా చర్చ వరకు వెళ్లిన దాఖలాలు లేవు. ఎందుకంటే, ఇక్కడ చర్చల కంటే  రాజకీయాల కే ప్రాధాన్యత ఎక్కువ. ఒకరు వేదిక మార్చమంటారు, మరొకరు అంశం కుదరదంటారు.. ఇద్దరూ మొండికేసి రోడ్డుపైకి వస్తే పోలీసులు ఎలాగూ  హౌస్ అరెస్టుల  స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉంటారు. తాజాగా తెలంగాణలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మధ్య నడుస్తున్న హైడ్రామా కూడా ఇదే కోవకు చెందుతుందా ? 
  
 రేవంత్ రెడ్డి  విమర్శలు.. కేటీఆర్ ‘డేట్ & టైం’ కౌంటర్! 

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఒక నిర్దిష్ట కుటుంబం తమ విచ్చలవిడి అవినీతితో యావత్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఆ నిరుపేద తెలంగాణను మా చేతుల్లో పెట్టింది అంటూ కేసీఆర్ కోటరీని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  అంతే వేగంగా స్పందించారు. గత పదిహేనేళ్లుగా తెలంగాణ అప్పులు, జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. రేవంత్ రెడ్డే ప్లేస్, టైమ్, డేట్ ఫిక్స్ చేసి చెబితే తానే స్వయంగా వస్తానని సవాల్ విసిరారు.
  
 తెలంగాణ భవన్‌లోనే తేల్చుకుందాం 

కేటీఆర్ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సవాల్‌ను స్వీకరిస్తూ సంచలన ప్రకటన చేశారు.  వేదిక ఎక్కడో ఎందుకు.. మీ సొంత కార్యాలయమైన  తెలంగాణ భవన్ లోనే చర్చకు మేం సిద్ధం  అని ప్రకటించారు. ఒక ప్రతిపక్ష నేత సవాల్ విసిరినప్పుడు అధికార పక్షం వారి సొంత గడ్డపైకే వచ్చి చర్చిస్తామని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.   

పొలిటికల్ మైండ్ గేమ్స్! 

 ఇలాంటి సవాళ్లు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఆడే మైండ్ గేమ్స్ మాత్రమే. గతంలోనూ కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య ఇలాంటి వందలాది సవాళ్లు వచ్చాయి. గన్ ఫౌండ్రి అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రమాణాలు, యాదగిరిగుట్టలో తడి బట్టలతో సవాళ్లు వంటివి తెలంగాణ సమాజం చాలానే చూసింది. కానీ తీరా ఆ రోజు వచ్చేసరికి..  పోలీసులు అనుమతి ఇవ్వలేదు , ప్రతిపక్షం పారిపోయింది ,  అధికార పక్షం హౌస్ అరెస్టులు చేయించింది అనే సాకులతో ఇరుపక్షాలూ పక్కకు తప్పుకుంటాయి.  రాజకీయ పార్టీలకు నిజంగానే తమ వాదనల్లో నిజాయితీ ఉంటే, రాష్ట్ర అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే తపన ఉంటే.. దానికి వీధులు, పార్టీ ఆఫీసులు వేదికలు కావు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన వేదిక శాసనసభ . అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాలూ పూర్తి స్థాయి శ్వేతపత్రాలు , అధికారిక గణాంకాలతో సమగ్రంగా చర్చించాలి. సభలో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పే వీలుంటుంది.. ప్రతిపక్షానికి కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా తమ గళాన్ని వినిపించే పూర్తి సమయం, హక్కు ఉంటుంది. సభను పక్కనబెట్టి రోడ్లపై, ప్రెస్ మీట్లలో సవాళ్లు విసురుకోవడం వల్ల కాలయాపన తప్ప మరేమీ ఉండదు.
 
పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్న ప్రజలు! 

నేటి తరం ఓటర్లు మునుపటి కంటే చాలా తెలివైన వారు. ఏ నాయకుడు నిజంగా మాట్లాడుతున్నాడు, ఎవరు కేవలం టాపిక్ డైవర్షన్ కోసం సవాళ్లు విసురుతున్నారనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, కేటీఆర్-కాంగ్రెస్ నేతల తాజా సవాళ్లను కూడా సామాన్య ప్రజలు కేవలం ఒక  పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్   పొలిటికల్ డ్రామాగానే చూస్తున్నారు. ఈ సవాళ్లు కేవలం న్యూస్ ఛానెళ్ల రేటింగులకు, సోషల్ మీడియా ట్రోల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. అసెంబ్లీ సాక్షిగా ఒక అర్థవంతమైన చర్చగా మారినప్పుడే తెలంగాణ అప్పుల అసలు గుట్టు, గత పదేళ్ల ప్రగతిపై ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుందన్నది ప్రజల అభిప్రాయం. 
 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
AP Urban Local body Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కంచుకోటలోనూ వైసీపీకి బిగ్ షాక్
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కంచుకోటలోనూ వైసీపీకి బిగ్ షాక్
AP Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు.. వారి వార్డుల్లో ప్రత్యర్థుల విజయాలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు.. వారి వార్డుల్లో ప్రత్యర్థుల విజయాలు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget