KTR on Modi : మోదీజీ ఇప్పుడు రూ. 30 లక్షలు ఇవ్వొచ్చు - బ్లాక్ మనీపై కేటీఆర్ సెటైర్ వైరల్ !
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు పెరగడంపై కేటీఆర్ సెటైర్ వేశారు. ఇప్పుడైతే మోదీ రూ. 30 లక్షలివ్వొచ్చంటున్నారు.
KTR on Modi : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము అమాంతం పెరిగిపోయిన అంశం వెలుగులోకి వచ్చింది. స్విస్ బ్యాంక్‌ల్లో భారతీయుల పెట్టుబడులు, డిపాజిట్లు ఒక్క ఏడాదిలో భారీగా పెరాగాయి. 2021లో భారతీయుల సంపద 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు.. అంటే మన కరెన్సీలో రూ. 30వేల 500 కోట్లకు చేరింది. ఇది గత 14ఏళ్లలో లెక్కలు చూస్తే ఇది గరిష్టం. 2020లో భారతీయుల నిధుల మొత్తం రూ. 20వేల 700 కోట్లుగా ఉంది. ఏడాది వ్యవధిలో అది దాదాపు 50 శాతం ఎగబాకి రూ. 30వేల 500 కోట్లకు చేరింది.
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ - కేంద్రం నిర్ణయంతో ఒక్కటి కాదు మూడు ప్రయోజనాలు !
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా నమోదైంది. అప్పట్లో ఈ అంశం రాజకీయంగానూ సంచలనం అయింది. ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించిన తర్వాత బీజేపీ బ్లాక్ మనీ అంశాన్ని హైలెట్ చేసింది. స్విస్ బ్యాంకుల నుంచి బ్లాక్ మనీ తీసుకు వస్తే ఒక్కో పౌరుడికి రూ. పదినేను లక్షలు వస్తాయని ప్రచారం చేశారు. నోట్ల రద్దు చేసినప్పుడు కూడా బ్లాక్ మనీ గురించే చెప్పారు. జన్ థన్ ఖాతాలు తెరిచింది ఆ డబ్బులు జమ చేయడానికేననని ఎక్కువ మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు పెరిగిపోతున్నాయి.
అందుకే తెలంగాణ మంత్రి కేటీఆర్ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు పెరిగిపోవడంపై సెటైర్లు వేశారు. ఏడాదిలో డిపాజిట్లు డబుల్ అయ్యాయి కాబట్టి డబుల్ ఇంజిన్ ట్రిక్ ద్వారా డబుల్ మొత్తం అంటే ఒక్కొక్కరి ఖాతాలో రూ. 30 లక్షలు వేయవచ్చని సలహా ఇచ్చారు.
Modi Ji,
— KTR (@KTRTRS) June 18, 2022
Golden opportunity for you to do a double engine trick & deposit ₹30 Lakhs (15 X 2) to each Indian account
Reminding you of your commitment 👇 pic.twitter.com/sZltYTENnh
టీఆర్ఎస్ ఎంపీ ఫ్లెక్సీల్లో పవన్, చిరంజీవి - కేసీఆర్ ఫోటో కూడా లేదేంటి ?
నిజానికి స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల సొమ్మంతా నల్లధనం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కొంత మంది ధనవంతులు అధికారికంగానే తమ సొమ్ములు అక్కడ దాచి పెట్టుకుంటూఉంటారు. అయితే స్విస్ బ్యాంకుల్లో సొమ్ములు అంటే బ్లాక్ మనీనే అనే ఓ అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్నే రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటూ ఉంటాయి.