అన్వేషించండి

Chiru Pavan In TRS MP Flexis : టీఆర్ఎస్‌ ఎంపీ ఫ్లెక్సీల్లో పవన్, చిరంజీవి - కేసీఆర్ ఫోటో కూడా లేదేంటి ?

కేసీఆర్ ఫోటో కూడా లేకుండా చిరంజీవి , పవన్‌ల ఫోటోలతో భారీగాఫ్లెక్సీలు వేయించారు టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఖమ్మంలో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.


Chiru Pavan In TRS MP Flexis :  తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన వద్దిరాజు రవిచంద్ర చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఖమ్మం అంతా పెట్టించారు.  ఇటీవల రాజ్య సభకు ఎంపికైనా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారదిరెడ్డిలు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఖమ్మం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు స్వాగతంతోపాటు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో రెండు రోజులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఖమ్మం నగరాన్ని గులాబీమయంగా చేశారు. పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వద్దిరాజు అభిమానులు మాత్రం వద్దిరాజు రవిచంద్రతోపాటు చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ పోటోలతో ప్రత్యేకంగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Chiru Pavan In TRS MP Flexis :  టీఆర్ఎస్‌ ఎంపీ ఫ్లెక్సీల్లో పవన్, చిరంజీవి - కేసీఆర్ ఫోటో కూడా లేదేంటి ?

కొన్ని ప్లెక్సీలలో కేవలం చిరంజీవి, పవన్‌కళ్యాణ్, వద్దిరాజు రవిచంద్ర ఫోటోలను పెట్టిన అభిమానులు కొన్ని ప్లెక్సీలలో వంగవీటి మోహనరంగ ఫోటోలను పెట్టారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర ఎంపీగా ఎన్నిక కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇలా ప్లెక్సీలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అగ్రనేతల ఫోటోలు కూడా లేవు. కేవలం సామాజిక వర్గానికి చెందిన నాయకుల ఫోటోలు ఉండటంతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందనేది వినిపిస్తుంది.
Chiru Pavan In TRS MP Flexis :  టీఆర్ఎస్‌ ఎంపీ ఫ్లెక్సీల్లో పవన్, చిరంజీవి - కేసీఆర్ ఫోటో కూడా లేదేంటి ?

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఈ విషయంపై కాస్తా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నుంచి ఎన్నికైన నాయకుడికి వేరే పార్టీలలో ఉన్న నాయకుల ఫోటోలతో కలిపి ప్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల ఈ విషయం ఇప్పుడు ఖమ్మం నగరంలో చర్చానీయాంశంగా మారింది.  వద్దిరాజుకు తెలియకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరని కొంత మంది వాదిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఇలా చేశారని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్‌లో ఇదో వివాదం అవుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో గ్రూపు విబేదాలు అధికం అయ్యాయి. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గ్రూపులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు కొత్త గ్రూపు ఏర్పాటుకు ఆస్కారం ఇస్తుందా..? అనేది ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ స్వాగత ప్లెక్సీలలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ పెక్సీల ఏర్పాటు ఇప్పుడు నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget