KTR Comments : జాతీయ స్థాయిలో పోటీ ఖాయం - తెలంగాణలో కాంగ్రెస్సే ప్రత్యర్థిగా తేల్చిన కేటీఆర్ !

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనేనని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

FOLLOW US: 

జాతీయ స్థాయిలో ఖచ్చితంగా పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎలా పోటీ చేస్తామన్నది కాలమే నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. పలు మీడియా చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని ఇతర పార్టీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 108 అసెంబ్లీ నియోజవకర్గాల్లో డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు కేటీఆర్. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ ఉంటుందన్నారు.  

తెలంగాణలో తాము కాంగ్రెస్‌తోనే పోటీ పడుతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.  ఎంత కాదన్నా బీజేపీకి ఐదు సీట్లు వస్తే కాంగ్రెస్‌కు ఆరు సీట్లు వస్తాయి కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్‌ మాకు ప్రత్యర్థి అని విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీని చచ్చిన పాముతో పోల్చారు కేటీఆర్. బీజేపీని తాము ప్రధాన ప్రత్యర్థిగా ఫోకస్ చేయడం లేదని..  బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టే ఫోకస్ చేస్తున్నామని స్పష్టం చేశారు.  అధికారంలో ఉండి పనులు చేయకుండా ఇక్కడకు వచ్చి మాట్లాడితే అడుగుతాం.. గుడ్డలిప్పి నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మాపై ఉందని కేటీా్ర చెబుతున్నారు. బీజేపీ వాళ్లను ఎక్స్‌పోజ్ చేయకుంటే ఈ అబద్దాలను ప్రజలు నిజం అనుకుంచే ప్రమాదం ఉందన్నారు. ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.  

దేశానికి తెలంగాణ ఇచ్చింది కానీ.. తెలంగాణకు దేశం ఇచ్చింది ఏమీ లేదన్నారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. మన డబ్బు తింటూ మనల్నే విమర్శిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్‌లో కులాల రాజకీయం ఉందన్నారు. కులాల ప్రకారం అక్కడ విడిపోయారని.. కానీ ఏపీలో అలాంటి రాజకీయం లేదన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని కేటీఆర్ విశ్లేషించారు. దేశానికి ఎజెండాను తెలంగాణ డిసైడ్ చేస్తోందన్నారు. 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  ప్రజల్నే నమ్ముకొని బరిలో దిగుతామని... మొదటి స్థానం మాది.. మిగతా స్థానాల్లో ఎవరు ఉంటారో కాలమే నిర్ణయిస్తుందన్నారు.  షర్మిల పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవచ్చు లేదా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ కూడా రావచ్చని.. చివరికి  కేఏ పాల్ కూడా  చాన్స్ ఉందని కేటీఆర్ సెటైర్ వేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ పూర్తిగా కామెడీ అయిపోయారన్నారు.  కేఏపాల్‌  బండి సంజయ్‌ అయిపోయారు... బండి సంజయ్‌ కేఏ పాల్ అయిపోయారని జోకులు వినిపిస్తున్నాయన్నారు. 

Published at : 22 Apr 2022 08:02 PM (IST) Tags: telangana politics telangana trs KTR TRS Working President

సంబంధిత కథనాలు

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ -  టీడీపీ నిర్ణయం !

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?

Anna Hazare President Candidate KCR Plan:   రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?

3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?

3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత  వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?

3 Years of YSR Congress Party Rule : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?

3 Years of YSR Congress Party Rule :   ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?

టాప్ స్టోరీస్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

Texas School Shooting :  మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?