అన్వేషించండి

Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?

Konda Surekha Political Options: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ పొలిటికల్ ఆప్షన్స్ ఏంటి? బిఆర్ఎస్, బిజెపిలలో చేరే అవకాశం ఎంత వరకూ ఉంది..?

Warangal Politics Konda Family:   కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో వారి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  మేము కాంగ్రెస్‌లోనే ఉంటాము అని ప్రకటిస్తున్నప్పటికీ, ఆచరణలో వారికి సొంత పార్టీలోనూ, ఇతర పార్టీలలోనూ దారులు దాదాపు మూసుకుపోయాయి.  

 కొండా దంపతుల రాజకీయ ప్రయాణం ఎటు?  

తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ నుంచి అనూహ్యంగా బర్తరఫ్ అయిన మాజీ మంత్రి కొండా సురేఖ , ఆమె భర్త కొండా మురళిలకు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాము కాంగ్రెస్ క్రమశిక్షణ కలిగిన నాయకులమని చెప్తున్నప్పటికీ, అధిష్టానంతో వచ్చిన పూడ్చలేని విభేదాల వల్ల సొంత పార్టీలోనే వారు పూర్తిగా ఒంటరిగా మారారనేది స్పష్టమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మరియు ఇతర సీనియర్ నాయకులు కూడా వారిని పక్కనపెట్టే ధోరణినే అవలంబిస్తుండటంతో కాంగ్రెస్‌లో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి   వైపు చూద్దామంటే, ఆ దారులు ఎప్పుడో మూసుకుపోయాయి. గతంలో బిఆర్ఎస్ పార్టీ వీడే సమయంలో కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలపై కొండా దంపతులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను గులాబీ నాయకత్వం ఇంకా మర్చిపోలేదు. ప్రస్తుతానికి బిఆర్ఎస్‌లోకి వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

భారతీయ జనతాపార్టీలోకి రావడం కష్టమే!

కాంగ్రెస్, బిఆర్ఎస్ దారులు మూసుకుపోవడంతో మిగిలిన ఏకైక ప్రధాన వేదిక భారతీయ జనతా పార్టీ  మాత్రమే. కానీ, బిజెపి రాజకీయ శైలి, అక్కడ ఉండే క్రమశిక్షణా రాశి కొండా దంపతుల శైలికి ఏమాత్రం పొసగవు. బిజెపి సిద్ధాంతపరమైన పునాదులతో పాటు సంస్థాగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. వరంగల్ బిజెపిలో ఇప్పటికే ఉన్న స్థానిక నేతలను పక్కనపెట్టి కొండా దంపతుల ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు కమలం కేడర్ సిద్ధంగా లేదు. పెత్తనం లేకపోతే ఇమడలేని కొండా సురేఖకు కమలం గూడు కూడా సవాలుగానే మారనుంది. సీనియర్ నేత మురళీధర్ రావు..బీజేపీ డస్ట్ బిన్ కాదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.  

సొంత రాజకీయం చేయడమే ఆప్షనా? 

ఇలాంటి స్థితిలో కొండా దంపతులకు ఏ పార్టీతోనూ పొత్తు కుదరని పరిస్థితి ఏర్పడితే, వారు  స్వతంత్ర పోరాటం వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు. వరంగల్ తూర్పు, పరకాల పరిధిలో తమకున్న సొంత క్యాడర్, అభిమానులను నమ్ముకుని ఒంటరిగా రాజకీయం చేయడం లేదా రాబోయే పరిణామాల వరకు సైలెంట్‌గా వేచి చూడడం తప్ప తక్షణమే వారి ముందుకు ఎలాంటి సులువైన రాజకీయ ప్రత్యామ్నాయాలు కనిపించడం లేదు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
YS Jagan Sharmila Dispute: కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget