అన్వేషించండి

Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారంలేదన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీపీసీసీ చీఫ్ మహేష్ క్యాబినెట్ విస్తరణ ప్రస్తుతానికి లేదన్నారు.
  • కొండా సురేఖ విషయంలో ఏఐసీసీ ఒప్పుకోలేదని మహేష్ తెలిపారు.
  • తెలంగాణ కులగణన రోల్ మోడల్, బీసీల కోసం కేంద్రాన్ని ప్రశ్నించారు.
  • మూడు ఖాళీ పదవులకు రేసులో చాలా మంది ఉన్నారు.

Mahesh Kumar Goud On Cabinet: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో  లేనట్లేనని ఆయన అన్నారు. దిల్లీలో క్యాబినెట్ విస్తరణపై చర్చ జగలేదని చెప్పారు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపై మాత్రమే చర్చ జరిగిందని చెప్పారు. క్యాబినెట్ విస్తరణపై హై కమాండ్ నుండి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలనేది   సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమని చెప్పారు. తనకు మంత్రి పదవి అన్న  ప్రచారంపై సమాచారం లేదన్నారు.  

అధిష్ఠానం ఒప్పుకోలేదు? 

కొండా సురేఖను కాపాడేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించినట్లు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సురేఖ విషయంలో అందరం మా వంతు ప్రయత్నం చేశామన్నారు. సురేఖ విషయంలో ఏఐసీసీ ఒప్పుకోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి నెరవేర్చారన్నారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశామని, రాబోయే వంద రోజులు దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తామన్నారు. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.  

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్‌, అరవింద్, ఈటల, లక్ష్మణ్ బీసీల అంశంపై స్పందించాలని కోరారు. అడిగితే తమ పదవులు పోతాయని బీజేపీ బీసీ నేతలు నోరు మెదపడంలేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఉండాలో వద్దో బీజేపీ బీసీ నేతలు తేల్చుకోవాలన్నారు. కుల గణనలో దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ చేసిన కులగణనలో అన్ని విషయాలు పొందుపరిచామన్నారు.  కేంద్రానికి పంపిన ఫైల్‌పై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఓబీసీల జనాభాను ఎందుకు లెక్కించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. 

మంత్రి వర్గవిస్తరణ? 

అయితే తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  క్యాబినెట్లో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. రేసులో మహేశ్ కుమార్ గౌడ్, విజయశాంతి, గడ్డం ప్రసాద్, రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Frequently Asked Questions

క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది?

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకారం, ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేనట్లే. దిల్లీలో దీనిపై చర్చ జరగలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమని ఆయన తెలిపారు.

దిల్లీలో జరిగిన చర్చల్లో ఏ అంశాలపై దృష్టి సారించారు?

దిల్లీలో కేవలం కొండా సురేఖ మరియు చిన్నా రెడ్డి అంశంపై మాత్రమే చర్చ జరిగింది. క్యాబినెట్ విస్తరణపై హై కమాండ్ నుండి ఎలాంటి సమాచారం లేదని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

కొండా సురేఖ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర ఏమిటి?

కొండా సురేఖను కాపాడేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించానని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే, ఈ విషయంలో ఏఐసీసీ అంగీకరించలేదని ఆయన తెలిపారు.

తెలంగాణ చేపట్టిన కుల సర్వే గురించి ఏమైనా చెప్పారా?

తెలంగాణ చేసిన కుల సర్వే శాస్త్రీయమైనదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కుల గణన దేశానికి రోల్ మోడల్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Jayesh Ranjan IAS to opts VRS | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Jayesh Ranjan | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget