అన్వేషించండి

Khammam SUDA: మంత్రి పువ్వాడకు తలనొప్పిగా మారిన ప్రధాన అనుచరుడిపై వసూళ్ల ఆరోపణలు

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ (Puvvada Ajay Kumar)కు ప్రధాన అనుచరుడు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ ఆరోపణలు వ్యవహారం మంత్రికి తలనొప్పిగా మారింది.

ఖమ్మంలో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రధాన అనుచరుడి వ్యవహారం మంత్రికి తలనొప్పిగా మారింది. పువ్వాడ అజయ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌పై వస్తున్న ఆరోపణలు ఖమ్మం నగరంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలల్లో కొన్ని ఇప్పుడు బహిర్గతం కావడంతో పువ్వాడ క్యాంపులో కలకలం రేపుతోంది.
ఖమ్మం జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రస్తుతం వస్తున్న ఆరోపణలతో ఇరకాటంలో పడుతున్నారు. సుడా చైర్మన్‌గా ఉన్న బచ్చు విజయ్‌కుమార్‌కు ప్రాధాన్యత కల్పించడంపై అటు పార్టీలోనూ ఇటు సొంత క్యాడర్‌లోనూ అసంతృప్తి నెలకొంది. అయితే ఎలాగైనా తన అనుచరుడికి ప్రాధాన్యత కల్పించాలనే నేపథ్యంలోనే మంత్రి పట్టుబట్టి ఆయనకు సుడా చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. అయితే ఇటీవల సుడా చైర్మన్‌ వసూళ్ల పర్వంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇది కాస్తా మంత్రికి తలనొప్పిగా మారింది. 
సుడాలో అసలేం జరిగింది..
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో హైదరాబాద్‌కు దీటుగా దూసుకువెళుతున్న ఖమ్మం నగరంలో సుడా చైర్మన్‌ పదవి కీలకంగా మారింది. దీంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ కూడా ఇక్కడ మాపియాగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన వెంచర్ల అనుమతికి సంబందించి అనేక కఠిన నిబంధనలు విదించింది. వెంచర్లను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా డీటీసీపీ అనుమతి కావాలిల్స ఉంది. అయితే ఖమ్మం నగరం చుట్టు పక్కల డీటీసీపీ అనుమతి లేకుండా అనేక లే అవుట్లు ఉండటం, కొన్ని వెంచర్లకు సంబందించి కనీసం గ్రామపంచాయతీ అనుమతులు లేకపోవడంతో వాటిపై సుడా ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఉన్న వెంచర్లను తొలగించారు.

ఇక్కడే అసలు కథ మొదలైంది. సుడా చైర్మన్‌కు సన్నిహితంగా ఉన్న వారిని వదిలేసి ఇతరులకు సంబందించిన వెంచర్లపై దాడులు నిర్వహించడంతో ఆగ్రహించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఒక్కసారిగా సుడా చైర్మన్‌ వసూళ్ల పర్వంపై ఆరోపణలు చేశారు. సుడా చైర్మన్‌కు సొమ్ములు ముట్టచెప్పిన వారికి ఎలాంటి అనుమతులు లేకుండా ఉంటే వారి వెంచర్ల జోలికి వెళ్లకుండా మిగిలిన వారిపై దాడులు నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సుడా చైర్మన్‌.?
ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో సన్నిహితంగా ఉంటున్న సుడా చైర్మన్‌ ఆయనకు సంబందించిన అనేక వెంచర్లకు అనుమతులు లేకపోయినప్పటికి వాటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం మిగిలిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అస్త్రంగా మారింది. సుడా చైర్మన్‌కు సన్నిహితంగా ఉంటున్న ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తుంటాడని, కనీసం గ్రామపంచాయతీ లే అవుట్‌ పర్మిషన్‌ కూడా లేకుండానే వెంచర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించకపోతుండటంతో అనేక మంది ఇతనిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్న సుడా చైర్మన్‌ తనకు సొమ్ములు ముట్టచెప్పిన వారి వెంచర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

సుడా పనితీరుపై ఆరంభం నుంచి ఆరోపణలు వస్తునప్పటికీ ప్రస్తుతం చైర్మన్‌ వసూళ్ల పర్వంపై మిగిలిన వారు గళమెత్తడంతో ఇప్పుడు మంత్రి పువ్వాడకు కాస్తా తలనొప్పిగా మారింది. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని పదేపదే చెప్పే పువ్వాడ అజయ్‌ ఇప్పుడు ప్రధాన అనుచరుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఇప్పుడు మంత్రి క్యాంప్‌లో చర్చానీయాంశంగా మారింది. 

Also Read: Nizamabad News: ఇందూరు జిల్లా నిజామాబాద్‌‌ ఎలా అయ్యింది, పేరు మార్చడానికి కారణం ఇదే

Also Read: Medaram Jatara: మేడారం భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్, సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget