KCR Vs BJP : కేసీఆర్ ఫార్మ్ హౌస్ సమావేశం అసలు విషయం ఇదే, దిల్లీకి స్పెషల్ టీం
యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై పోరాడాలని కేసీఆర్ నిర్ణయించారు. ఫార్మ్ హౌస్ అత్యవసర సమావేశంలో ఇదే నిర్ణయం తీసుకున్నారు.
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో అత్యవసరంగా జరిపిన సమావేశంలో కేంద్రంపై అలుపు లేకుండా పోరాడాలని కేసీఆర్ ( KCR ) నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎజెండా కూడా ధాన్యం కొనుగోళ్ల అంశంపైనే ఉండనుంది. ఈ మేరకు కార్యాచరణ కూడా ఖరారు చేసుకున్నారు. 21వ తేదీన సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో ( Telangana Bhavan ) టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షా సమావేశం ( TRSLP ) నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, టికెట్ల రేట్ల పెంపు, ఐదు షోలకు అనుమతి
తెలంగాణ యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ( Central Governament ) ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులతో జరిపిన సమావేశంలో ఇదే నిర్ణయాన్ని ప్రకటించారు. సోమవారం శాసనసభాపక్ష భేటీ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్, కారులో ఎమ్మెల్యే కుమారుడు?
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. పంజాబ్ వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ ( Punjab ) తరహాలో 100 శాతం ఎఫ్‌సీఐ ద్వారా సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేయనుంది. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలు పై ఈ దఫా ఉధృతమైన పోరాటాలు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ఎల్పీ విస్తృత భేటీ నిర్వహిస్తూండటం టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశం అవుతోంది. ధాన్యం కొనుగోలుపై ఇంతకు ముందే రెండు సార్లు ధర్నాలు నిర్వహించారు. రెండు సార్లు మంత్రులు.. ఇతర ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లాయి. అయితే వారికి సానుకూల సంకేతాలు రాలేదు. ఓ సారి కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. కానీ ఎవరితోనూ భేటీ కాలేదు. మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది.