అన్వేషించండి

RRR Ticket Rates : ఆర్ఆర్ఆర్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, టికెట్ల రేట్ల పెంపు, ఐదు షోలకు అనుమతి

RRR Ticket Rates : ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.

RRR Ticket Rates : ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల రేట్లు(Cinema Tickets Rates) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) హీరోలుగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం చిత్ర బృందం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమాకి టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఏపీ(AP) ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఆమోదిస్తూ జీవో విడుదల చేసింది. ఏపీలో ఈ సినిమా టికెట్ రేటును 75 రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపింది. 

RRR Ticket Rates : ఆర్ఆర్ఆర్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, టికెట్ల రేట్ల పెంపు, ఐదు షోలకు అనుమతి

ఐదు షోలకు అనుమతి  

ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్ల పెంచుకునేందు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎయిర్ కండీషన్డ్ థియేటర్లు(AC Theatre) ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లపై మొదటి మూడు రోజులు (మార్చి 25-27 వరకు) అదనంగా రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు టికెట్ల రేట్లపై అదనంగా రూ.30 పెంచుకోడానికి అనుమతి ఇచ్చింది. ఐమాక్స్(IMAX), మల్లీప్లెక్స్, సింగిల్ థియేటర్లలోని రిక్లైనర్ సీట్లకు మొదటి మూడు రోజులు అదనంగా రూ.100 పెంచుకోవచ్చని, మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ల రేట్లలో మార్పులు లేవని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి పది రోజులు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 వరకు చిత్ర ప్రదర్శన చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. పన్నుల మినహాయింపులు, అనుమతులు తాత్కాలికమని ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో టికెట్ల రేట్లు పెంపు

ఆర్.ఆర్.ఆర్ మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరిట జీవో విడుదల అయింది. సినిమా రిలీజ్ అయ్యే ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక ధరలు అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవోలో వివరించింది. టిక్కెట్ ధరలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
AR Rahman - Subhash Ghai: నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
Embed widget