అన్వేషించండి

Pawan Kalyan: 'వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ' - ఎన్నికల్లో కూటమిదే అధికారమన్న జనసేనాని

Andhrapradesh News: సీఎం జగన్ అహంకార పాలనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Pawan Kalyan Comments In Pithapuram: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన అంతం చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పునరుద్ఘాటించారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 'వారాహి విజయభేరి' సభలో పవన్ ప్రసంగించారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని.. కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జీ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. ఇక్కడ లక్ష మెజారిటీతో గెలపిస్తా అన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

'మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా'

పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ హామీ ఇచ్చారు. 'పిఠాపురానికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకువస్తా. నియోజకవర్గం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉంది. పవన్ కల్యాణ్ మీకు జవాబుదారీతనం. నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఎంతో విశిష్టమైన నేల ఇది. ఈ నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకే వచ్చా. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆస్పత్రులన్నీ బాగు చేస్తా. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా. 54 గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తా. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తా. నన్ను ఓడించడానికి చిత్తూరు నుంచి మిథున్ రెడ్డి వచ్చారు. మండలానికి ఓ నాయకుడిని పెట్టారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు.' అంటూ పవన్ ధ్వజమెత్తారు.

వైసీపీపై విమర్శలు

ఈ సందర్భంగా వైసీపీపై.. పవన్ విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్ కు భూములిచ్చిన రైతులకు మేలు జరగలేదని.. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైసీపీ నేతలు ఏం చేశారు.? అని ప్రశ్నించారు. 'నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని.. జగన్ లా సీఎం కొడుకుని కాదు. జగన్, సజ్జల, పెద్దిరెడ్డి అందరూ పేదవారట. కాకినాడ పోర్టు.. డ్రగ్స్, డీజిల్ మాఫియాకు అడ్డాగా మారింది. యువతకు రూ.5 వేల జీతం కావాలా.? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా.? అనేది ఆలోచించుకోవాలి. ప్రజాధనం దోచేసిన జగన్ పేదవాడు.. సొంత డబ్బును పంచిన నేను పెత్తందారుడినా..?. మద్య నిషేధం అని చెప్పి, కల్తీ మద్యం మరణాల్లో రాష్ట్రాన్ని ప్రథమం చేశారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు. వైసీపీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల్లో కూటమి కావాలో.. వైసీపీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు. ఈ సభకు జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

కాగా, పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో 5 రోజులు పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో క్యాంపెయిన్ చేయనున్నారు. ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు. 

Also Read: CM Jagan: సీఎం జగన్ రోడ్ షోలో కలకలం - బస్సుపైకి చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి, పోలీసుల విచారణ

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget