Janasena List: జనసేన అభ్యర్థుల జాబితా విడుదల - పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్, 18 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు
Andhrapradesh News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల జాబితాను ఆదివారం రిలీజ్ చేశారు. మొత్తం 18 నియోజకవర్గాల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
Pawan Kalyan Released Janasena Candidates List: ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆదివారం రిలీజ్ చేశారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు (Janasena) 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ క్రమంలో 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను జనసేనాని అధికారికంగా ప్రకటించారు. ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ అసెంబ్లీ స్థానాలతో పాటు మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండగా.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ మనోహర్ బరిలో నిలిచారు.
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
జనసేన అభ్యర్థుల జాబితా#VoteForGlass pic.twitter.com/StgTL6ZqK7
— JanaSena Party (@JanaSenaParty) March 24, 2024
☛ పిఠాపురం - పవన్ కల్యాణ్
☛ తెనాలి - నాదెండ్ల మనోహర్
☛ నెల్లిమర్ల - లోకం మాధవి
☛ అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
☛ కాకినాడ రూరల్ - పంతం నానాజీ
☛ రాజానగరం - బత్తుల రామకృష్ణ
☛ నిడదవోలు - కందుల దుర్గేష్
☛ పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
☛ యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్
☛ పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
☛ రాజోలు - దేవ వరప్రసాద్
☛ తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
☛ భీమవరం - పులపర్తి ఆంజనేయులు
☛ నరసాపురం - బొమ్మిడి నాయకర్
☛ ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
☛ పోలవరం - చిర్రి బాలరాజు
☛ తిరుపతి - ఆరణి శ్రీనివాసులు
☛ రైల్వేకోడూరు - డా.యనమల భాస్కరరావు
లోక్ సభ అభ్యర్థులు
☛ కాకినాడ - తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
Also Read: Mrps: ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు - 35 అంశాలతో చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ వినతి