అన్వేషించండి

Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్ - ఇంకా 2 స్థానాల్లో పెండింగ్, పిఠాపురంలో పవన్ రెండో రోజు పర్యటన

Andhrapradesh News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖ దక్షిణం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటివరకూ 19 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన తన అభ్యర్థులను ప్రకటించింది.

Pawan Kalyan Announced Visakha South Contestant: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan) మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. విశాఖ దక్షిణం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా సీహెచ్ వంశీకృష్ణ యాదవ్ పేరును జనసేనాని ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ప్రస్తుతం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం, బహిరంగ సభల ప్రణాళికలు వంటి వాటిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణం అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించారు. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకూ 19 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇంకా అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అసెంబ్లీ అభ్యర్థులు

 పిఠాపురం - పవన్ కల్యాణ్

 తెనాలి - నాదెండ్ల మనోహర్

 నెల్లిమర్ల - లోకం మాధవి

 అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

 కాకినాడ రూరల్ - పంతం నానాజీ

 రాజానగరం - బత్తుల రామకృష్ణ

 నిడదవోలు - కందుల దుర్గేష్

 పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు

 యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్

 పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ

☛ రాజోలు - దేవ వరప్రసాద్

 తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

 భీమవరం - పులపర్తి ఆంజనేయులు

 నరసాపురం - బొమ్మిడి నాయకర్

 ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

 పోలవరం - చిర్రి బాలరాజు

 తిరుపతి - ఆరణి శ్రీనివాసులు

 రైల్వేకోడూరు - డా.యనమల భాస్కరరావు

విశాఖ దక్షిణం - వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్

లోక్ సభ అభ్యర్థులు

 మచిలీపట్నం - వల్లభనేని బాలశౌరి

కాకినాడ - తంగెళ్ల ఉదయ శ్రీనివాస్

పిఠాపురంలో పవన్ పర్యటన

మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుహూతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ దేవీ, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభునికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

అటు, తొలి రోజు పిఠాపురంలో 'వారాహి విజయభేరి' సభలో పవన్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని.. కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జీ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. ఇక్కడ లక్ష మెజారిటీతో గెలపిస్తా అన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

Also Read: Botsa Satyanarayana: నాకు గన్ మెన్ కూడా ఇవ్వలేదు, లోకేష్‌కు Z కేటగిరి సెక్యూరిటీనా? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Embed widget