అన్వేషించండి

TRS As BRS : బీఆర్ఎస్‌గా మారాలంటే మూడు నెలలు ఆగాల్సిందే - కేసీఆర్‌కు ఏదీ కలసి రావడం లేదా ?

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చేందుకు మరికొంత కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇతరులెవరైనా ఆ పేరుతో పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే మాత్రం ఈ ప్రక్రియ మరింత క్లిష్టం కానుంది.

TRS As BRS : తెలంగాణ అధికార పార్టీ నేతలకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. మేం ఫలానా పార్టీ నాయకులం అని చెప్పుకోవడానికి వారు తంటాలు పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులా..? బీఆర్ఎస్ పార్టీ నాయకులా ? అన్న క్లారిటీ వారికి లేకుండా పోయింది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలమని ఫ్లెక్సీలు వేసుకున్నారు.  మరికొంత మంది అధికారికంగా ఇంకా అనుమతి రాలేదు కాబట్టి తాము టీఆర్ఎస్ నేతలమే అంటున్నారు. ఇలా ఎవరి చాయిస్ ప్రకారం వారు ఎంచుకుంటున్నారు. ఈ గందరగోళానికి ఎప్పుడు ముగింపు లభిస్తుందా అని పార్టీ పెద్దలను ఆరా తీస్తున్నారు. కానీ వారూ ఏం  చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే... టీఆర్ఎస్ ..బీఆర్ఎస్‌గా ఎప్పుడు మారుతుందో  వారికీ స్పష్టంగా తెలియడం లేదు. 

ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారడం కష్టమే ! 

టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మారడం ఇన్‌స్టంట్‌గా అయ్యే పని కాదని గులాబీ నేతలకు తెలిసి వచ్చింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఐదో తేదీన తీర్మానం చేసి.. ఆరో తేదీన ఈసీకి అందచేశారు. వెంటనే పార్టీ పేరు మార్చాలని కోరారు. అయితే ఈసీ ఇప్పటి వరకూ ఆ తీర్మానాన్ని పరిశీలించిందో లేదో స్పష్టత లేదు. కానీ ఈసీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల నిర్వహణలో తీరిక లేకుడంా ఉంది. అదే సమయంమలో నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. దాన్ని కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. 

ఇతరులెవరైనా భారత రాష్ట్ర సమతి కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే గగనమే ! 

నిబంధనల ప్రకారం భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చాలంటే ఈసీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే అనుమతి లభించడం కష్టమే. ముందుగా ఆ దరఖాస్తును ఉపసంహరించుకునేలా చేయాలి. ఆ వ్యక్తి పట్టుబడితే.. ఈసీదే ఫైనల్ అవుతుంది. కాదంటే.. ఇక బీఆర్ఎస్ పేరును మరోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఫాలో అప్ చేయడానికి ఈసీ  ఖాళీగా లేదు.డిసెంబరు 8వ తేదీ వరకు అసెంబ్లీ ఎన్నికల బిజీలో కమిషనర్లు ఉంటున్నందున ఆ తర్వాత మాత్రమే బీఆర్ఎస్ ఫైల్‌కు సంబంధించిన సీరియస్ యాక్టివిటీ మొదలవుతుందని భావిస్తున్నారు. అలా చేసినా ఈసీ కొన్ని నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుంది. అది అయ్యే సరికి మూడు నెలల సమయం పట్టవచ్చనేది ప్రాథమిక అంచనా. అంే ఇప్పుడల్లా అనుమతి రానట్లే. 

ఢిల్లీ బహిరంగసభ కూడా అనుమానమే..! 

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేసిన వెంటనే... టీఆర్ఎస్ వర్గాలు.. ఢిల్లీలో బహిరంగసభపై లీకులు ఇచ్చాయి. ఢిల్లీ వేదికగానే జాతీయ పార్టీ ఆవశ్యకత, జెండా, ఎజెండా, విధివిధానాలు, పాలసీ తదితరాలను కేసీఆర్ వివరించాలనుకుంటున్నారని అందు కోసం రామ్‌లీలా మైదానంలో డిసెంబరులో భారీ స్థాయిలో సభను ఏర్పాటు చేసి దానికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు డిసెంబరు 9న సభ ఉండే అవకాశం ఉందన్న హింట్ కూడా ఇచ్చారు. కానీ బీఆర్ఎకు సంబంధించిన పేరు మార్పు ప్రాసెస్‌కు ఈసీ దగ్గర సమయం పట్టే అవకాశం ఉన్నందున ఢిల్లీలో కేసీఆర్ సభ కూడా ఆ తర్వాతే జరగనుంది. ఈ లోపు ఈసీ నుంచి క్లియరెన్స్ వస్తే మాత్రం.. సభ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Embed widget