అన్వేషించండి

Lokesh Yatra : నారా లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా ? టీడీపీ ఆరోపణలు నిజమేనా ?

లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? టీడీపీ ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ స్పందనేంటి ?


Lokesh Yatra :  తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర కోసం లోకేష్ ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసంటీడీపీ మొత్తం యాక్టివ్ అయింది. రూట్ మ్యాప్ సహా..  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు రావొచ్చు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ముందస్తుగా కసరత్తు పూర్తి చేశారు. బ యటకు తెలియకయపోయినా యువ నేతలతో కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందస్తు సన్నాహాలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇరవై ఏడో తేదీన యాత్ర ప్రారంభం కానుంది. అయితే టీడీపీ మాత్రం..  లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వైఎస్ఆర్‌సీపీ అటు అధికారపక్షంతో పాటు ఇటు  రాజకీయంగానూ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. దీనికి పలు కారణాలను చూపిస్తోంది. 

లోకేష్ పాదయాత్రకు అనుమతిపై తేల్చని పోలీసులు !

లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారని..ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు, ఇతర సంఘ విద్రోహ శక్తుల నుంచి  ముప్పు  పొంచి ఉందని  .. భద్రత కల్పించాలని రెండు వారాల కిందటే ఏపీ పోలీసులకు టీడీపీ నుంచి లేఖ వెళ్లింది. కానీ పోలీసులు స్పందించలేదు. రెండో సారి టీడీపీ రిమమైండర్ పంపిన తర్వాత  పోలీసుల నుంచి స్పందన వచ్చింది.  పాదయాత్ర కు సంబంధించి డీటైల్స్..  ఎన్ని రోజులు నిర్వహిస్తారు.. ఏ  రోజు ఏఎక్కడ పాదయాత్ర చేస్తారు.. ఎంత మంది పాల్గొంటారు అన్న వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై టీడీపీ మళ్లీ సమాధానం పంపింది. అయితే అనుమతి ఇస్తారా లేదా అన్నదానిపై  స్పష్టత లేదు. పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని  టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 

జీవో నెంబర్ 1 లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికేనంటున్న టీడీపీ !

ఇటీవల వైసీపీ ప్రభుత్వం  జారీ చేసిన  జీవో నెంబర్ వన్ లోకేష్ పాదయాత్ర జరగకుండా టార్గెట్ చేసి రిలీజ్ చేసిందేనని.. టీడీపీ వర్గాలంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను వైసీపీ భరించలేకపోతోందని అందుకే కట్టడి చేయాలనుకుంటోందని అంటున్నారు. ఆ జీవో విషయం  ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఇప్పటికైతే స్టే ఇచ్చారు. స్టేను ఎత్తి వేయాలని జీవో అమలు చేసేలా అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది. కానీ సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. 23వ తేదీన విచారణ జరగనుంది. ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో హైకోర్టు పెట్టిన ఆంక్షల కారణంగా ఆ పాదయాత్రను రైతులు ఆపేయాల్సి వచ్చింది. ఏ చిన్న ఆంక్షలు పెట్టినా పోలీసులు విశ్వరూపం చూపిస్తారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

కుప్పంలో దాడులు చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతల పిలుపులు !

మరో వైపు కుప్పంలో లోకేష్ పాదయాత్ర రోజున ఆయనను అడ్డుకుందామని.. దాడులు చేద్దామని.. వైఎస్ఆర్‌సీపీ తరపున కొంత మంది నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతి  పురం మండలం ఎంపీపీ కోదండరెడ్డి ఇచ్చిన ఈ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పర్యటనల్లో ఉద్రిక్తలు సృష్టించి.. పాదయాత్రను నిలిపివేసే కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. 

లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు ఏర్పడితే ప్రభుత్వానికే చెడ్డపేరు !

లోకేష్ పాదయాత్రకు వైసీపీ ద్వారా కానీ.. ప్రభుత్వం  ద్వారా కానీ ఆటంకాలు ఏర్పడితే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేసే అధికారంలోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ అనుమతులు తీసుకోలేదు. అనుమతులు అవసరం లేదని వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాదయాత్ర సజావుగా సాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. అయితే.. ఏం జరగనుందనేది  మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. లోకేష్ యాత్రను చూసి భయపడుతున్నారని అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
Embed widget