అన్వేషించండి

Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?

Telangana Congress : సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలే కాదు సూపర్ సీనియర్స్ కూడా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ సూపర్ సీనియర్స్‌కు ఉన్న వాల్యూను రేవంత్ గుర్తించడం లేదా?

Is Revanth insulting Congress super seniors : " నేను 33 ఏళ్లకే గాంధీభవన్ ఇంచార్జ్‌గా చేశా.. రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేశా. పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నా.. ఇవన్నీ ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సిన రావడం ఇబ్బందికరంగానే ఉంది ".. అని కాంగ్రెస్ సూపర్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేఖ రాసిన కారణం ఓ బహిరంగసభలో కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ అక్రమంగా ఉందని దాని కూలగొట్టవద్దా అని ప్రశ్నించడం. బీఆర్ఎస్ నేతలతో కలిపి కేవీపీ పేరు చెప్పిన రేవంత్ రెడ్డి ఆయన ఫామ్ హౌస్ ను కూడా అక్రమ కేటగిరీలో చేర్చడంతో మనోవేదనకు గురయ్యారు. తనను గౌరవించాలని ఆయన తన లేఖ ద్వారా వేడుకున్నారు. 

ఇప్పటికే పళ్లంరాజు సోదరుడి ఫామ్హౌస్ కూల్చివేత  

కాంగ్రెస్ సూపర్ సీనియర్లను రేవంత్ రెడ్డి విస్మరించడం.. విమర్శించడం ఇదే మొదటి సారి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన పళ్లంరాజు సోదరుడికి చెందిన ఓ ఫామ్ హౌస్‌ను కూల్చివేశారు.  హైకమాండ్ కు  పళ్లంరాజు ఫిర్యాదు చేసినా రేవంత్ లెక్క చేయలేదని పూర్తిస్థాయిలో కూల్చివేయించారని అంటారు. పళ్లంరాజు సోదరుడు బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని రేవంత్ హైకమాండ్‌కు నివేదిక ఇచ్చారని చెబుతారు. ఇప్పుడు కేవీపీ అంశం కూడా తెరపైకి వచ్చింది. కేవీపీని రేవంత్ ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించారన్నది కాంగ్రెస్ వర్గాలకూ అర్థం కాని విషయమే. ఎందుకంటే కేవీపీ వైఎస్ కు ఆత్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చనిపోయేవరకూ కీలక నేత. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ తో వెళ్లడమో లేదో మరో పార్టీ వైపు చూడటమో చేయలేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు.

తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?

కేవీపీ కూడా బీఆర్ఎస్‌కు అనుకూలంగా పని చేశారని రేవంత్ అనుమానమా?

ఉమ్మడి రాష్ట్రంలో కేవీపీ హవా ఎక్కువగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన పెద్దగా ఎక్కడా బయటకు కనిపించలేదు. కానీ ఆయన తెలంగాణలో తెర వెనుక వ్యవహారాల్లో కీలక  పాత్ర పోషిస్తున్నారని చాలా కాలం పాటు ప్రచారం జరిగింది. దీనికి కారణం వైఎస్ హాయంలో వ్యాపార వర్గాలతో ఆయనకు ఉన్న పరిచయాల వల్ల.. కాంట్రాక్టులు, ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకున్నారని కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు విషయంలోనూ ఆయన హస్తం ఉందన్న గుసగుసలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పొలిటికల్ గాసిప్స్ మాత్రమే. నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి  మాత్రం.. కేవీపీని కాంగ్రెస్ నేతగా పెద్దగా పరగిణనలోకి తీసుకోలేదు. మూసి ప్రాజెక్టు విషయంలో వైఎస్ హయాంలోనే పని చేశామని.. ఆ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా.. తర్వాత విరమించుకున్నానని కేవీపీ తన లేఖలో గుర్తు చేసుకున్నారు. 

Also Read: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!

కాంగ్రెస్ కల్చర్‌లో హైకమాండ్ నిర్ణయం ఫైనల్. ఇలాంటి సూపర్ సీనియర్లు అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు విధేయులు. ప్రజల్లో పలుకుబడి ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. వీరికి హైకమాండ్ వద్ద పలుకుబడి ఉంటుంది. వీరు హైకమాండ్ ను కలిసినప్పుడల్లా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒకటి, రెండు మాటలు చెబుతూ వచ్చినా.. ఆయన పై కాంగ్రెస్ పెద్దల్లో నెగెటివ్ మార్కులు పడుతూ వస్తాయి. ఇలాంటివి రేవంత్‌కు మైనస్ చేస్తాయని.. కాంగ్రెస్ సూపర్ సీనియర్ల విషయంలో ఆయన మరింత గౌరవం ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget