అన్వేషించండి

Janasena Confusion : ఒంటరి పోరాటానికే పవన్ మొగ్గు చూపుతున్నారా ? మోదీతో భేటీ తర్వాత వ్యూహం మారిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరి పోటీకే మొగ్గు చూపుతున్నారా? ప్రజలను ఒక్క చాన్స్ అడిగి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారా ?

Janasena Confusion :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటన తర్వాత రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతం కంటే భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఒక్క చాన్స్ ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నారు. అన్ని చోట్లా అభ్యర్థుల్ని పెడతానని.. ఎవరైనా అడ్డుకుంటే సంగిత చూస్తానని హెచ్చరిస్తున్నారు. నిన్నటిదాకా ఆయన ఓట్లు చీల్చబోనని అన్న ప్రకటనలకు.. ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు చాలా తేడా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ రూటు మార్చుకున్నారా ? ఒంటరి పోరాటానికి మొగ్గు చూపుతున్నారా అనే వాదన వినిపించడం ప్రారంభమైంది. 

మోదీని మూడు రోజుల తర్వాత పొగడ్తలతో ముంచెత్తిన జనసేనాని !

ప్రధానమంత్రి మోదీతో  భేటీ జరిగిన మూడు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరుడు.. ధీరుడు అని దేశాన్ని క్లిష్టపరిస్థితుల నుంచి కాపాడుతున్నారని అభినందించారు. ఈ మర్మమేంటో రాజకీయవర్గాలకు అంతు చిక్కకుండా ఉంది.  ఒక వేళ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పి ఉంటే సరిపోయేది కానీ ప్రత్యేకంగా ఇలా పొగడ్తలకు మూడు రోజుల తర్వాత సమయం కేటాయించడమే ఆశ్చర్యకరంగా ఉంది. మోదీ సమావేశం తర్వాత ఆయనకు ఏమైనా సందేశం వచ్చిందా లేకపోతే.. సమావేశంలో తమ మధ్య జరిగిన చర్చల్లో మోదీ చెప్పిన విషయంలో ఏదైనా కొత్తగా అర్థం అయిందా అనేదానిపై క్లారిటీ మాత్రంలేదు. 

విజయనగరంలో ఒక్క చాన్స్ అడిగిన పవన్ కల్యాణ్ !

విజయనగరం జిల్లా గుంకలాన్ గ్రామంలో జగనన్న ఇళ్లలో అవినీతిపై పోరాటానికి వెళ్లి ప్రసంగించిన సందర్భంలో పవన్ కల్యాణ్ ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. అంతే కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థిని పెడతా.. నామినేషన్ వేయనివ్వకపోతే ఎం చేయాలో తెలుసని హెచ్చరించారు. నామినేషన్ వేయనిస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే అన్ని చోట్లా పోటీ చేయబోతున్నామన్న సంకేతాలను పవన్ కల్యాణ్ పంపినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేసినా..  ఆయన తనకు చాన్స్ ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారు. 

ఇప్పటం పోరాటం తర్వాత ప్రజల్లో మైలెజ్ పెరిగిందని భావిస్తున్నారా ?  మోదీ కొత్త ప్రణాళిక ఏమైనా చెప్పారా ?

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటనపై పోరాటం వల్ల తనకు .. జనసేనకు రాష్ట్ర వ్యాప్త మైలేజ్ వచ్చిందన్న అభిప్రాయం  పవన్ కల్యాణ్‌లో ఉందని అంటున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసైన వైపు చూస్తారని.. అవకాశం ఇస్తారని భావిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీ ప్రస్తావన కూడా తీసుకు రావడం లేదు. తానే సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. గతంలో చంద్రబాబునాయుడు విశాఖ ఘటనపై సంఘిభావం తెలిపినప్పుడు వైసీపీ సర్కార్‌ను కూలదోయడం కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా కలిసి పోటీ చేయడంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు కానీ ఏపీ బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. వ్యూహం మార్చుకుంటున్నానని చెప్పడం ద్వారా పవన్ విధానంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

గందరగోళంతోనే జనసేన రాజకీయాలు !

పవన్ కల్యాణ్ సినిమాలను పూర్తి స్థాయిలో వదిలేయలేరు. అది తన వృత్తి అని పార్టీని నడపడానికైనా సినిమాలు చేయాలని ఆయనంటున్నారు. అదే సమయంలో జనసేన రాజకీయ పయనం కూడా అలాగే ఉంది. ఇన్నేళ్లైనా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లే్కపోతే.. వైసీపీ ఓటమి కోసం పని చేయాలా అన్నదానిపైనా క్లారిటీ లేదు . ప్రస్తుతం  పొత్తులో ఉన్న బీజేపీతో అయినా కలిసి ఉండాలా లేదా అన్నదానిపైనా క్లారిటీ ఉన్నట్లుగా లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో జనసేనతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పొత్తులు వద్దని.. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వ కావాలని ప్రజలు కోరుకుంటే గెలిపిస్తారు.. లేకపోతే లేదని కొంత మంది వాదిస్తున్నారు. ఈ కారణంగా ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారాలు చివరి వరకూ తెగెలా కనిపించడం లేదు. 

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget