By: ABP Desam | Updated at : 30 May 2023 09:00 AM (IST)
చంద్రబాబు పేరు చెబితే పథకాలు గుర్తుకు రావా ? స్కీమ్స్ వైఎస్ఆర్‌సీపీ సొంతమేనా ?
Chandrababu : చంద్రబాబు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పథకాలు చెప్పండి అంటూ ప్రత్యర్ధులు సవాల్ చేస్తూంటారు. మీ హయాంలో చేసిన మంచి పథకాలు చెప్పుకొని ఓట్లు అడిగే దమ్ముందా అంటూ సెటైర్లు పేలుతుంటాయి. ఈ అంశంపై టీడీపీ నేతలు పెద్దగా స్పందించరు. ఎందుకంటే ఉచిత హామీల్లో బెంచ్ మార్కుల్లాంటి హామీలు ఆయన ఇవ్వలేదు. అదే సమయంలో టీడీపీ నేతలు.. అభివృద్ధిని తెరపైకి తెస్తారు. తాము చేసిన అభివృద్ధిని మీరు చేయగలరా .. అభివృద్ధి చేశామని నిరూపించి ఓట్లు అడగగలరా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వైసీపీ పథకాల గురించి.. టీడీపీ అభివృద్ధి గురించి సవాళ్లు చేసుకుంటాయి కానీ ఒకరికొకరు సమాధానం చెప్పుకోరు.
రాజకీయ పార్టీల్లో ఎవరి స్టైల్ వారిది !
రాజకీయ పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలతో ఉంటాయి. అందరూ ప్రజలకు మంచి చేస్తామని చెబుతూ ఉంటారు. అందరి లక్ష్యం కూడా అదే. అయితే ఆయా రాజకీయ పార్టీల స్టైల్ మాత్రం వేరే. కాంగ్రెస్ ఉన్నప్పుడు వైఎస్ నేరుగా పథకాల పేరుతో ప్రజలుకు లబ్ది కలిగించేవారు. అదే పద్దతి వైఎస్ఆర్‌సీపీ ప్రారంభించింది. టీడీపీ అభివృద్ధి చేసి.. సంపద పెంచి ప్రజలకు పంచుతామని చెబుతుంది. ఏదైనా అంతిమంగా ప్రజలకు మంచి చేయడమే. అయితే నేరుగా నగదు బదిలీ చేస్తే.. ఉరకనే వచ్చిన సొమ్ముకు విలువ ఉండదన్నట్లుగా మారిపోతుందన్న సిద్ధాంతం టీడీపీది. అందుకే పథకాల ప్రచారంలో వెనుకబడిపోయింది.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది సంస్కరణలు, అభివృద్ధి
చంద్రబాబు పేరుతో వెంటనే ఎలాంటి పథకాలు గుర్తుకు రావు. కానీ ఆయన చేసిన సంస్కరణలు ఎన్నైనా చెప్పొచ్చనని టీడీపీ నేతలంాటారు. సామాన్యులకు కావాల్సింది మాత్రం పథకాలు, ప్రచారం. అదే ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది. చంద్రబాబు గొప్ప అడ్మినిస్ట్రేటర్, సంస్కర్త అనే మాటలు ఒకప్పటివి. ఇప్పుడు ఆయన కూడా మారిపోయారు. సంస్కరణలను పక్కన పెట్టి ఉచితాలతో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే అస్త్రాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రయోగిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే మేనిఫెస్టో విడదల చేసి శంఖారావం పూరించారు. అయితే దీన్ని చూస్తున్న వారంతా చంద్రబాబు వెళ్తున్న దారిపై అనేక అనుమానాలు, అనేక విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తన సహజసిద్ధమైన వైఖరికి భిన్నంగా వెళ్తున్నారని ఇది ఆయనకు నష్టాన్ని కలిగించేదై ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఈ సారి రూట మార్చినట్లేనా ?
తాను పరిగెడుతూ ఉద్యోగులను, నాయకులను పరుగులు పెట్టించే డైనమిక్ చంద్రబాబు... దానికి భిన్నంగా ట్రావెల్ చేశారుచంద్రబాబు ఉచితాలకు దూరంగా ఉండటం ప్రత్యర్థులకు కలిసి వచ్చిందని గ్రహించి తాను కూడా ఉచితాల బాట పట్టారు. కానీ అది ప్రత్యర్థులకు ఆయన ఇచ్చిన అస్త్రంగా విశ్లేషకులు చెబుతున్నారు. అదే 2009లో జరిగిందని... 2019లో సేమ్ సీన్ రిపీట్ అయిందని అంటున్నారు. అయితే చంద్రబాబు తన పాలనలో ఎప్పుడూ సంక్షేమాన్ని మర్చిపోలేదు. 2014-19 కాలంలో చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు సహా అనేక పథకాలు ప్రజలకు మేలు చేశాయి. కానీ బెంచ్ మార్క్ అన్న రీతిలో ప్రచారం చేసుకోలేదు. ఆ ప్రచారం అభివృద్ధి విషయంలో చేసుకుంటారు. అందుకే చంద్రబాబు పేరు చెబితే పథకాలు కాకుండా అభివృద్ధి గుర్తుకు వస్తుంది. అదే వైసీపీ అయితే పథకాలు గుర్తుకు వస్తాయి..అబివృద్ధి అనేది గుర్తుకు రాదని టీడీపీ నేతలంటున్నారు.
Sharad Pawar: అనూహ్య పరిణామం- శరద్ పవార్ తో అదానీ భేటీ, ఫ్యాక్టరీ సైతం ప్రారంభం
Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత
Retired IPS Nageswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు మరో వివాదాస్పద ట్వీట్-ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేశారంటే..
మల్కాజ్ గిరి టికెట్ రేసులో మర్రి రాజశేఖర్ రెడ్డి, శంభీపూర్ రాజు!
తెలంగాణలో 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్, హైకమాండ్ కు జాబితా పంపిన స్క్రీనింగ్ కమిటీ
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>