News
News
X

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

బీజేపీపై పోరాటంలో కేసీఆర్ దూకుడు తగ్గించారా ? గవర్నర్‌తో రాజీ, బడ్జెట్‌పై మౌనం దేనికి సంకేతం ?

FOLLOW US: 
Share:

 

KCR Political strategy :  తెలంగాణ సీఎం  కేసీఆర్ రాజకీయ వ్యూహం మరోసారి సైలెంట్ గా మారిపోయింది. మామూలుగా అయితే తెలంగాణకు ఇంత అన్యాయం చేసిన బడ్జెట్ విషయంలో బీజేపీపై విరుచుకుపడి ఉండాల్సింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకు ముందే గవర్నర్ విషంయలో తాడో పేడో అన్నట్లుగా సాగించిన పోరాటం కూడా రాజీతో ఆగిపోయింది. కేసీఆర్ ఒక్క సారిగా గవర్నర్ విషయంలో రాజీ పడిపోతారని ఎవరూ ఊహించలేదు. అందుకే..కేసీఆర్ రాజకీయ వ్యూహం మారిందా ? బీజేపీతో దూకుడు తగ్గించారా ? అన్న చర్చ వినిపించడానికి కారణం అవుతోంది. 

బడ్జెట్‌పై స్పందించని సీఎం కేసీఆర్ ! 

నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవు. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ దండిగా నిధులు కేటాయిస్తుందని అనుకున్నారు. విడుదల చేసినా చేయకపోయినా కేటాయింపులు అయితే ఉంటాయనుకున్నారు. కానీ అవి కూడా చేయలేదు. కానీ కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు.   2022లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ ను ఎవరూ మర్చిపోలేరు. రెండు గంటల పాటు బీజేపీని చీల్చి చెండాడారు.  ఆయన ఆవేశం దేశంలోని విపక్షాలను కూడా ఆకర్షించింది. ఈ సారి ఎన్నికలున్న కర్ణాటకకు కూడా కొన్ని ప్రత్యేక నిధులు కేటాయించారు. అయినా కేసీఆర్ మాత్రం ఆవేశ పడలేదు. ప్రెస్ మీట్ పెట్టలేదు సరి కదా ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు.

గవర్నర్‌తోనూ అనూహ్య పద్దతిలో రాజీ ! 
  
గవర్నర్ తమిళిసై పోరాటం అంటే బీజేపీపై యుద్ధం అనుకున్నట్లుగా పోరాడిన కేసీఆర్ చివరి క్షణంలో  వెనక్కి తగ్గారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో గవర్నర్ ఏం చెప్పినా సరే ప్రభుత్వం అంగీకరిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెట్టకూడదని గత సమావేశాలకు పొడిగింపు అని ప్రకటించారు. తర్వాత సీన్ మారిపోవడంతో గవర్నర్ తో అదే నోటిఫికేషన్ ఇప్పించారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగించాలి కాబట్టి ప్రసంగ పాఠాన్ని ముందుగానే అధికారులు గవర్నర్ కు పంపారు. ఈ ప్రసంగంలో గవర్నర్ పలు మార్పులు సూచించారు గవర్నర్ ప్రసంగం సహజంగా కేబినెట్ ఆమోదించినదే ఉండాలి. అయినప్పటికీ గవర్నర్  అడిగిన మార్పులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. అయితే గవర్నర్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీఆర్ఎస్ చీఫ్ ఒక్క సారిగా ఇలా వెనక్కి తగ్గడం  అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.

కేసీఆర్ బీజేపీపై దూకుడు తగ్గించారా ?
 
తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీని కార్నర్ చేయడానికి ఇంత కంటే మంచి సమయం రాకపోవచ్చు. తెలంగాణ కోసం ఎంతో చేస్తున్నామని లక్షల కోట్ల నిధులిస్తున్నామని బీజేపీ చెబుతోంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ద్వారా ఆ పార్టీని టార్గెట్ చేయడానికి అవసరమైన స్టఫ్ ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం వాటిని అందుకుని బీజేపీని కార్నర్ చేయడానికి సిద్ధం కాలేకపోతున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా జాతీయంగా బడ్జెట్ పై స్పందన వ్యక్తం చేస్తే జాతీయ మీడియా కూడా ప్రాధాన్యం ఇచ్చేది.  కేంద్రంపై పోరాటానికి జాతీయ పార్టీ పెట్టినా   బడ్జెట్ పై స్పందనను కేసీఆర్ ఎందుకు వ్యక్తం చేయడం లేదనేది సస్పెన్స్ గా మారింది.  

సాధారణంగా కేసీఆర్ రాజీపడటాన్ని అంగీకరించరు. వెనుకబడటాన్ని కూడా ఒప్పుకోరు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. జాతీయ పార్టీగా మారిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ పార్టీ పెట్టక ముందు ఉన్నప్పటి దూకుడు తగ్గించారు. అందుకే అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్‌గా మారింది. కేసీఆర్ రాజకీయ చాణక్యుడని ఎలాంటి అడుగు వేసినా.. తనదైన వ్యూహం ఉంటుందని పార్టీ క్యాడర్ నమ్మకంతో ఉన్నారు. 

Published at : 03 Feb 2023 05:05 AM (IST) Tags: BRS KCR vs BJP Telangana politics Bharat rashtra samiti BJP Vs BRS

సంబంధిత కథనాలు

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!