Ganta Srinivas : రాజీనామాకే కట్టుబడిన గంటా శ్రీనివాస్ - ఆమోదించాలని స్పీకర్‌కు మరోసారి లేఖ !
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు మరోసారి స్పీకర్ సీతారాంను కోరారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేశారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivas Rao ) తన పదవికి రాజీనామా చేసేందుకే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గతంలో తాను పంపిన రాజీనామా లేఖను ఆమోదించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ( Speaker Tammineni Sitaram ) మరో లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రాజీనామా సమర్పించారు. ఆయనే స్పీకర్‌కు స్వయంగా రాజీనామా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant ) ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. అయితే మొదట ఆయన రాసిన లేఖ ఫార్మాట్‌లో లేదన్న విమర్శలు రావడంతో ..తర్వతా ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇచ్చారు.
పవన్ కు చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలి : మంత్రి అవంతి శ్రీనివాస్
తర్వాత గంటా శ్రీనివాసరావు ఓ సారి ఆముదాల వలస వెళ్లి స్పీకర్‌తో సమావేశమయ్యారు. తన రాజీనామాను ( REsighn Letter ) ఆమోదించాలని కోరారు. అయితే ఇంత వరకూ స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం కొనసాగుతోంది. కార్మికులు రోడ్డున పడి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇటీవలే ఆస్తుల మదింపు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ తరుణంలో తన రాజీనామా విషయంలో వెక్కి తగ్గకూడదని గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తనను ఇంతటి వాడిని చేసిన జిల్లా ప్రజల కోసం దేనికైనా సిద్ధమని గంటా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఏపీ, వైసీపీ సర్కార్ రూ.70 వేల కోట్లు దారి మళ్లించింది : పురంధేశ్వరి
స్పీకర్‌కు మరోసారి గంటా లేఖ రాసినందున నిర్ణయం తీసుకుంటారో లేదోనన్న ఆసక్తి ఏర్పడుతోంది. సాధారణంగా ప్రత్యేకమైన కారణాలేమీ లేకపోతే .. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఏడాది నుంచి కోరుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే.. ఆరు నెలల్లో ఉపఎన్నికలు వస్తాయి. అదే జరిగితే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ కారణంగానే రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు.