Minister Avanti Srinivas: పవన్ కు చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలి : మంత్రి అవంతి శ్రీనివాస్
Minister Avanti Srinivas: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని మంత్రి అవంతి ప్రశ్నించారు. బీజేపీ నేతలు కేంద్రం చేస్తున్న అప్పులపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
Minister Avanti Srinivas: బీజేపీ(BJP) నేతలకు చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(Minister Muttamsetti srinivasrao) అన్నారు. ఆదివారం విశాఖలో మాట్లాడిన ఆయన పురంధేశ్వరి(Purandheswari) ఏపీ అప్పుల గురించి మాట్లాడుతున్నారని, కేంద్రం అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. విభజన హామీలు అమలుపై బీజేపీ నాయకులు చేసున్న కృషి ఏంటో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్(Steel Plant) విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ ఇప్పటికే రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారన్నారు. పురంధేశ్వరికి చిత్త శుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) గురించి మాట్లాడాలన్నారు. పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. నిజంగా పవన్ కల్యాణ్ కు ఏపీపై శ్రద్ధ ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలన్నారు.
జగనన్న కాలనీలు సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు(Jagananna Colony) సిద్ధం అవుతున్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ(Visakha) జిల్లాలో భూ సేకరణపై విషయంలో కోర్టు పిల్ కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణకు చర్యలు చేపట్టామన్నారు. దీంతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలతో ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు.
సీఎం చేతుల మీదుగా పట్టాలు
భూ సేకరణతో 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తామని మంత్రి అవంతి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోడానికి టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్(CM Jagan) మాత్రం అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారన్నారు. విద్య, వైద్యానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అవంతి పేర్కొన్నారు. త్వరలోనే సీఎం చేతులు మీద పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి అవంతి అన్నారు. మండలానికి ఒక పీహెచ్సీ సెంటర్ ఉండాలని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగనన్న కాలనీ ద్వారా కొత్త గ్రామాలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రతి పక్షాలు అభివృద్ధి కుంటుపడిందని అన్నడం ఫ్యాషన్ గా మారిందన్నారు. అమ్మ ఒడికి రూ.8 వేల కోట్లు కేటాయించారని మంత్రి అవంతి అన్నారు.