Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kawasaki KLX230 Launched: కవాసకీ కంపెనీ మనదేశంలో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అదే కవాసకీ కేఎల్ఎక్స్230. దీని ధర రూ.3.3 లక్షలుగా ఉంది. ఇందులో లిమిటెడ్ ఫీచర్లు ఉన్నాయి.

Kawasaki KLX230 Price: కవాసకి కొత్త మోటార్‌సైకిల్ కేఎల్ఎక్స్230 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ బైక్‌ను విడుదల చేయడంతో ఇది భారతీయ మార్కెట్లో విక్రయించే అత్యంత ఖరీదైన రోడ్ లీగల్ డ్యూయల్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా మారింది. ఈ బైక్ పవర్, ఫీచర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కవాసకి బైక్‌ల ధర చాలా ఎక్కువగా ఉంది. మంచి మైలేజీని ఇచ్చే అనేక ద్విచక్ర వాహనాలను ఈ బ్రాండ్ మోటార్‌సైకిల్ ధరలో కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో కవాసకి కేఎల్ఎక్స్230 ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.30 లక్షలుగా ఉంది.
కవాసకి కేఎల్ఎక్స్230 ఇంజిన్
కవాసకి కేఎల్ఎక్స్230... 233 సీసీ ఎయిర్ కూల్డ్ మోటార్‌తో మార్కెట్లోకి వచ్చింది. బైక్‌లోని ఈ మోటార్ 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 18.1 హెచ్‌పీ పవర్, 6,400 ఆర్‌పీఎమ్ వద్ద 18.3 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బైక్ ఇంజన్ కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. చూసినట్లయితే ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కాస్త తక్కువగానే ఉంది. ఈ బైక్‌లో 7.6 లీటర్ల వరకు పెట్రోల్ నింపుకోవచ్చు. ఈ బైక్‌లో ముందువైపు 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు 250ఎమ్ఎమ్ మోనోషాక్ ఉన్నాయి.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
కవాసకి కేఎల్ఎక్స్230 ఫీచర్లు
కవాసకి తీసుకువచ్చిన ఈ కొత్త బైక్‌లో లిమిటెడ్ ఫీచర్లు అందించారు. ఈ మోటార్‌సైకిల్‌లో మోనోటోన్ ఎల్సీడీ ఉంది. దీనిని బ్లూటూత్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందించారు. బైక్‌లో 880 ఎంఎం పొడవాటి సీటు చూడవచ్చు. కవాసకి తీసుకువచ్చిన ఈ మోటార్‌సైకిల్‌లో షార్ట్ సీట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
కవాసకి బైక్ వేటితో పోటీ పడుతుంది?
కవాసకి కేఎల్ఎక్స్230కి పోటీగా ఇండియన్ మార్కెట్లో చాలా బైక్‌లు ఉన్నాయి. ఈ బైక్ ప్రత్యర్థులు హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ, ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.51 లక్షలుగా ఉంది. ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.64 లక్షలుగా నిర్ణయిచారు. కవాసకి తీసుకువచ్చిన ఈ బైక్‌లతో పోలిస్తే హీరో మోటార్‌సైకిల్ ధర దాదాపు రూ. 1.5 లక్షలు తక్కువ.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
The #KLX230 brings its high-octane performance straight to the urban landscape. Gear up for an unparalleled riding adventure and "Your Gateway to the Pure Off Road Lifestyle" like never before.
— IndiaKawasaki (@india_kawasaki) November 11, 2024
Link :-https://t.co/8abUWwEYDd#GetOutAndPlay #GoodTimes #Kawasaki #KLX230 #KLX pic.twitter.com/6ew5xqp62J
#KLX230 dual-sport features an ABS switch for more control. Turn off the front & rear ABS to experience confidence-inspiring control on low-friction surfaces.
— IndiaKawasaki (@india_kawasaki) November 8, 2024
For More Information of Kawasaki KLX230 please visit our website.
Link :-https://t.co/8abUWwEYDd
#GetOutAndPlay pic.twitter.com/35CvhWuAGJ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

