అన్వేషించండి

TDP : డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి ఇంటి పోరు - టీడీపీలోకి కుటుంబీకులు !

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కుటుంబసభ్యులు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తన రాజకీయ వారసురాలిగా కుమార్తె పల్లవిని పుష్పశ్రీవాణి మామ చంద్రశేఖరరాజు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, ఆయన కుమార్తె పల్లవి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ వీరు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. పుష్పశ్రీవారి భర్త పరీక్షిత్ రాజు. ఆయన శుత్రచర్ల చంద్రశేఖర్ రాజు తండ్రి. మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖరరరాజు వైఎస్ఆర్‌సీపీలోనే ఉండేవారు. అయితే పార్టీ పట్ల వ్యతిరేకతతో ఇటీవల ఆయన దూరం జరిగారు. పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి ఉంది. ఓ సారి పార్టీ వేదికపై ఆమె కన్నీరు పెట్టుకోవడం సంచంలనం సృష్టించింది. 

‘జగనన్న విద్యాదీవెన’కు నిధులు విడుదల, మీట నొక్కిన సీఎం - విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి నేరుగా

శత్రుచర్ల చంద్రశేఖరరాజు సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించినప్పటికీ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. పలుమార్లు వైయస్ జగన్ ను కలిసేందుకు ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వలేదని.. తమ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభివృద్ధి చేసిన వ్యక్తి ఈ రోజు వాళ్లకి అవసరం లేదని చంద్రశేఖర్ రాజు మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తె శత్రుచర్ల పల్లవి ప్రకటించారు.త్వరలో టిడిపి పెద్దలను, కలిసి పార్టీ లో చేరినున్నట్లు  ప్రకటించారు. అమరావతి అయినా... గిరిజన ప్రాంతమైన అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చంద్రశేఖర్ రాజు ధీమా వ్యక్తం చేశారు. 

‘కడుపులో కాలిపోయి ఉన్నా సహజ మరణమా? ఇదంతా మన ఆంధ్రుల కర్మ’ - నాగబాబు
 
తమ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి రాజకీయాల్లో కి రావడం జరిగిందని శత్రుచర్ల పల్లవి ప్రకటించారు. గిరిజన సమస్యలపై ప్రజల తరపున పోరాటం చేస్తామని ..కురుపాం లో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తామన్నారు. త్వరలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతామని పల్లవి ప్రకటించారు. పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు మాత్రం వైఎస్ఆర్‌సీపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 

చంద్రశేఖర్ రాజు తన కుమారుడు పరీక్షిత్ రాజును కాకుండా.. కుమార్తె పల్లవిని రాజకీయ వారసులిగా ప్రకటించడంతో .. పుష్పశ్రీవాణికి ఇంటిపోరు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. కురుపాం నుంచి ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన పుష్పశ్రీవాణి..  జగన్‌కు విధేయురాలిగా ఉన్నారు. ఆయితే తన భర్తకు ప్రాధాన్యం దక్కడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూంటారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్‌కు కారణం అయిన మామ టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో  డిప్యూటీ సీఎం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget