News
News
X

ఏపీ బీజేపీలో సోమువీర్రాజు ఒంటరి పోరు- జిల్లాల అధ్యక్షుల నియామకం ఏక పక్షం అంటూ నేతల ఆగ్రహం

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు  ఈ మధ్య జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కృష్ణాజిల్లా, నరసరావుపేట, ప్రకాశం జిల్లాలకు పార్టీ జిల్లా అధ్యక్షులను ఖరారు చేశారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌ బీజేపిలో విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానిక నాయకులు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రాజీనామాలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు  ఈ మధ్య ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కృష్ణాజిల్లా, నరసరావుపేట, ప్రకాశం జిల్లాలకు పార్టీ జిల్లా అధ్యక్షులను ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా పని చేసిన వారిని పార్టీ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో కాకా రేపుతోంది. దీనిపై నేతలంతా చాలా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కొందరు బాహాటంగానే తమ అయిష్టతను చెబుతుంటే... మరికొందరు లోలోపల రగిలిపోతున్నారని పార్టీ ఇన్‌సైడ్ టాక్. 

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేశ్వరరావు, అనకాపల్లి అధ్యక్షుడిగా పరమేశ్వరరావు, రాజమండ్రి అధ్యక్షుడిగా బొమ్మల దత్తు, మచిలీపట్టణం అధ్యక్షుడిగా గుత్తికొండ రాజాబాబు, నరసరావుపేట అధ్యక్షుడిగా ఆలోకం సుధాకర్, ఒంగోలు అధ్యక్షుడిగా శివారెడ్డిని నియమించారు. వీరితోపాటుగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌లను కూడా ఆయా జిల్లాలకు నియమించారు. ఈ నియామకాలకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి సంతకాలతో ఆయా నూతన అధ్యక్షులకు అందించారు.

కోర్ కమిటిలో చర్చలేదు....
నూతన నియామకాలు పార్టీ పరంగా చేసిన విషయాన్ని పార్టీ కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కనీసం కోర్ కమిటీకి కూడా సమాచారం లేకుండా ఏకపక్షంగా నియామకాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటంపై నేతలు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నేతల మధ్య చర్చ జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికి, వాటిని పార్టీ కోర్ కమిటీలో చర్చించి పార్టీ వర్గాలకు పూర్తి సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు ఏపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం పై చర్చ జరగాల్సి ఉందని అంటున్నారు.

పార్టీలో అధ్యక్షుడి ఓంటరి పోరు 

జాతీయ పార్టీ బీజేపీలో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతాయి. ఎవరూ అధిష్ఠానం లైన్ దాటి ఏ పని చేయడానికి లేదని... ఏం చేయాలన్నా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రచారం చేస్తుంటారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితిలేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నారు. దీని కారణంగానే పార్టీలో అంతర్గతంగా విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నాయని ప్రచారం ఉంది. 

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సొము వీర్రాజును పార్టీలోని పలువురు కీలక నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్నారు. సమాజిక వర్గాల వారీగా కూడా పార్టీలో గ్రూప్స్‌ నడుస్తున్నట్టు ఓ ప్రచారం ఉంది. సొము వీర్రాజు తన సొంత సామాజిక వర్గానికి చెంది నేతలను కూడా పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతుంది. అందుకే సొము వీర్రాజు సింగల్‌గానే పార్టీలో పోరాటం చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఆరు జిల్లాలకు అధ్యక్షుల నియామకం కూడా వీర్రాజు తన అధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఆయా జిల్లాల్లోని నేతలు కూడా ఈ నియామకాలను వ్యతిరేకిస్తూ బహిరంగానే విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ రాజీనామా....

జిల్లాల అధ్యక్షుల నియామకంలో తమతో చర్చింకుడా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధ్యక్షుడు సొము వీర్రాజు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుంళం జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న చిగురుపాటి కుమార స్వామి, బీజేపి పార్టీ బాధ్యతల నుంచి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ విడుదల చేశారు. వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొనటం విశేషం.

Published at : 03 Jan 2023 10:42 AM (IST) Tags: BJP Andhra Pradesh BJP Somu Veerraju

సంబంధిత కథనాలు

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు - గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?

KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు -  గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

టాప్ స్టోరీస్

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!