అన్వేషించండి

Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!

Delimitation Bill 2026: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నియోజకవర్గాలను పెంచేందుకు సిద్ధమైంది. దీంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా పట్టు నిలుపుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైంది.
  • డీలిమిటేషన్ బిల్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ నియోజకవర్గాలకు అధికారం కల్పిస్తుంది.
  • జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ స్థానాలు 90 నుంచి 114కు పెరుగుతాయి.
  • ఈ బిల్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగమనే వాదనను బలపరుస్తుంది.

Delimitation Bill 2026: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా ఆమోదించుకొని చరిత్ర సృష్టించాలని కేంద్రం చూస్తుంది. పనిలో పనిగా జమ్ము కశ్మీర్ విషయంలో కూడా అత్యంత కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకోనుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే దశాబ్దాల నాటి వాదనను చట్టబద్ధంగా మరింత బలపరిచే దిశగా చర్యలు తీసుకుంటోంది. 

డీలిమిటేషన్ బిల్లు పీవోజేకేపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

డీలిమిటేషన్ బిల్లులో అత్యంత ప్రధానమైన అంశం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ నియోజకవర్గాలకు సంబంధించి కీలక ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ భూభాగాలు ఎప్పుడైతే విముక్తి పొందుతాయో అప్పుడే ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని ఈ బిల్లు భారత ఎన్నికల కమిషన్‌కు కట్టబెడుతోంది. 

అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ బిల్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ తక్షణమే ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వదు. ఇది ఒక భవిష్యత్ కార్యాచరణ. ఆ భూభాగం తిరిగి భారత్‌ ఆధీనంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన వెసులుబాటును ముందుగానే కల్పిస్తోంది. 

అసెంబ్లీ స్థానాలు 90 నుంచి 114కు పెంపు 

ఈ బిల్లుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సవరణల ప్రకారం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ నిర్మాణంలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో 90 స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 114 కు పెరుగుతుంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ కోసం 24 స్థానాలను ఖాళీగా ఉంచుతున్నారు. ఈ స్థానాల వల్ల ప్రస్తుతం భారత్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాల ఓటింగ్‌ శక్తికి ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్ నుంచి లోక్‌ స్థానాల సంఖ్యను ప్రస్తుతం 5 నుంచి 7కు పెంచే అవకాశం ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యేల సంఖ్యను ఐదు నుంచి 7కు పెంచరు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు కశ్మీరీ వలసదారులు, ఒకరు పాక్ ఆక్రమిత కశ్మీర్ శరణార్థి అయ్యి ఉంటారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి ఈ నామినేషన్లు చేసే అధికారం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సభ్యుల సంఖ్యను రెండు నుంచి మూడుకి పెంచే ప్రక్రియ నియోజకవర్గాల సర్దుబాటు తర్వాతే అమలులోకి వస్తుంది. 

పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకుంటామని గతంలోనే ప్రకటించిన నేతలు 

ఈ బిల్లు  రాజకీయ, వ్యూహాత్మక ఎత్తుగడ వెనుక చాలా పెద్ద కథనే ఉంది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో అనేక సార్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ ప్రాంత ప్రజలే పాకిస్తాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఎటువంటి బలప్రయోగం లేకుండానే ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి పొందుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా అంతర్జాతీయ వేదికలపై ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని పలుమార్లు నొక్కి చెప్పారు. ఏదో ఒక రోజు భారత్ పూర్తి అధికారాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు వచ్చిన  డీలిమిటేషన్ బిల్లు 2026 ఆ ఆశయాలకు ఒక చట్టపరమైన రూపంగా కనిపిస్తోంది. 

Frequently Asked Questions

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026 దేని గురించి?

ఈ బిల్లు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనను ప్రతిపాదిస్తుంది. ప్రత్యేకించి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని భూభాగాలు విముక్తి పొందినప్పుడు అక్కడి నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతను భారత ఎన్నికల కమిషన్‌కు అప్పగించనుంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు ఈ బిల్లు వల్ల తక్షణమే ఎన్నికలు జరుగుతాయా?

లేదు, ఈ బిల్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తక్షణమే ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వదు. ఇది భవిష్యత్తు కార్యాచరణ, ఆ భూభాగం భారత్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన వెసులుబాటును అందిస్తుంది.

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలు ఎలా మారుతాయి?

పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ స్థానాల సంఖ్య 90 నుంచి 114కు పెరుగుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ కోసం 24 స్థానాలు ఖాళీగా ఉంచుతారు.

జమ్మూకశ్మీర్‌ లోక్‌ స్థానాల సంఖ్య పెరుగుతుందా?

అవును, జమ్మూకశ్మీర్‌ నుంచి లోక్‌ స్థానాల సంఖ్యను ప్రస్తుతం 5 నుంచి 7కు పెంచే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget