అన్వేషించండి

Delimitation Politics : పునర్విభజనపై రేవంత్ బాటే కేటీఆర్ మాట - దక్షిణాదికి అన్యాయంపై యుద్ధమే - కలసి పోరాడతారా?

Delimitation: డీలిమిటేషన్ ను వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఒకే వాదన వినిపిస్తోంది. కలసి పోరాటం చేసే విషయంలో కలిసే అవకాశాలు కనిపించడం లేదు.

Delimitation BJP: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు దారితీస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరిదీ  ఒకే విధానంగా కనిపిస్తోంది.  మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై కేటీఆర్ విరుచుకుపడుతుండగా, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దక్షిణాది హక్కుల కోసం గళం ఎత్తుతోంది.

  జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలను సీట్ల పెంపు విషయంలో శిక్షించడం అన్యాయమని కేటీఆర్ అంటున్నారు.  ప్రస్తుత పార్లమెంటులో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా ఏ మాత్రం తగ్గకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇదే అంశంపై రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా విభజన ఉండకూడదని స్పష్టం చేశారు. విధానపరంగా ఇద్దరు నేతలు ఒకే తాటిపై ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాల దృష్ట్యా వీరు కలిసి పోరాడే అవకాశం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.

బిజెపి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శఇస్తున్నారు.  ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాపై నమ్మకం లేదని మండిపడ్డారు. 50 శాతం సీట్ల పెంపుపై ఎక్కడా అధికారిక ప్రకటన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కుల కోసం తాము ఇతర పక్షాలతో కలిసి పోరాడుతామని చెబుతూనే, రేవంత్ రెడ్డిని  బీజేపీ ప్రతినిధి గా ముద్ర వేయడం ద్వారా కాంగ్రెస్‌తో కలిసి నడిచే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ అధిష్టానం కూడా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో, వారితో చేతులు కలిపితే తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే, ఇద్దరి లక్ష్యం దక్షిణాది ప్రయోజనాలు  అయినప్పటికీ, ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇది కేవలం సిద్ధాంతాల పోరాటం కంటే పవర్ పాలిటిక్స్ గానే ఎక్కువగా కనిపిస్తోంది.                        

 డీలిమిటేషన్ అంశం తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది. ఒకే సమస్యపై అధికార, ప్రతిపక్షాలు ఒకే మాట మీద ఉన్నా.. గల్లీలో ఉన్న వైరం వల్ల ఢిల్లీలో గళం కలపలేకపోతున్నాయి. ఒకవేళ కేంద్రం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, ఈ ఇద్దరు నేతలు విడివిడిగానే నిరసన గళాలు వినిపిస్తారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అనివార్యంగా ఒకే వేదికపైకి వస్తారా  అన్నది వేచి చూడాలి.  గతంలో తమిళనాడులో స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. ప్రస్తుతానికి మాత్రం ఈ కామన్ పాలసీ  కేవలం ప్రకటనలకే పరిమితం కానుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget