అన్వేషించండి

CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు

Telangana CM Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ పదవులు, పోస్టులు అంటూ పైరవీల కోసం ఆగస్టు 3 వరకు గాంధీ భవన్ వైపు రావొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పదవుల కోసం గాంధీభవన్‌కు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం.
  • నియోజకవర్గాల్లో పనిచేయని నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం.
  • ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావద్దని నేతలకు సీఎం ఆదేశం.
  • మెరుగైన BLAలకు రాహుల్ గాంధీతో ఫోటో అవకాశం ఉంటుందని సీఎం.

Congress Politics | హైదరాబాద్: మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన వాతావరణం ఉంటుంది. పార్టీ పదవులు రాలేదని కొందరు అసంతృప్తి చేస్తుంటే, మంత్రి పదవులు రాలేదని బహిరంగంగానే విమర్శలు చేసేంత స్వేచ్ఛ హస్తం పార్టీలో ఉంటుంది. ఓవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే, మరోవైపు పార్టీ బాధ్యతల్ని చూసుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. అయితే 
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన 'సర్‌' (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జూమ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు, నామినేటెడ్ ఛైర్మన్ పోస్టుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వచ్చే వారికి ఎలాంటి అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని పార్టీ అగ్రనాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాద్ చుట్టూ తిరగడంపై రేవంత్ అసహనం

కొందరు నేతలు నియోజకవర్గాల్లో కాకుండా హైదరాబాద్‌లోనే ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలెవరూ పార్టీ ఆఫీసు అయిన గాంధీభవన్‌కు రావొద్దని, ఈ లోపు ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో దీనిపై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

సర్ ప్రక్రియపై బీఎల్ఏ రిపోర్టులపై ఆధారపడకూదు.. సొంతంగా వర్క్ చేయాలి

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 489 భేటీలు జరిగాయని, ముఖ్యంగా వెనుకబడిన నియోజకవర్గాల్లోని నేతలు ఇప్పటికైనా చురుగ్గా స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి సమీక్షలు నిరంతరం జరపాలని, ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట బాధ్యతగా పనిచేయని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) నివేదికలపై ఆధార పడటం కంటే పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) రిపోర్టులను పరిశీలించాలని, కేవలం అధికారుల నివేదికలపైనే ఆధారపడితే చర్యలు ఉంటాయన్నారు.

Also Read:  CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతలు రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలి. పదవులు, పోస్టులు అంటూ హైదరాబాద్ చుట్టూ తిరిగితే కుదరదు. జులై 30న SIR పై మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఈ ప్రక్రియను సమన్వయం చేయాలి. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియ మీద ఫోకస్ చేయాలి, కానీ గాంధీ భవన్ వైపు మాత్రం పైరవీల కోసం ఎవరూ రావొద్దు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిపిస్తామని, ఆయనతో ఫొటో దిగే ఛాన్స్ ఇస్తామని’ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

 

Frequently Asked Questions

గాంధీ భవన్‌కు రావద్దని నేతలకు ఎందుకు సూచించారు?

పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు హైదరాబాద్‌లోనే ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో పనిచేయకుండా ఇక్కడ ఉండకూడదని ఆదేశించారు.

గాంధీ భవన్‌కు రాకుండా నేతలు ఏం చేయాలి?

ఆగస్టు 3 వరకు నేతలు గాంధీ భవన్‌కు రాకుండా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం తరహాలో విస్తృతంగా పర్యటించాలి. ఇన్‌ఛార్జి మంత్రులు జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తారు.

అత్యుత్తమంగా పనిచేసిన బీఎల్‌ఏలకు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారు?

అత్యుత్తమంగా పనిచేసిన 100 మంది బీఎల్‌ఏలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిపిస్తామని, ఆయనతో ఫొటో దిగే అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

SIR కార్యక్రమంపై తదుపరి పూర్తిస్థాయి సమీక్ష ఎప్పుడు జరుగుతుంది?

SIR కార్యక్రమంపై జులై 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget