భవిష్యత్తు భారత ఫుట్‌బాల్ జట్టులో మెరవబోయే స్టార్ ఆటగాళ్లలో పలువురు తెలంగాణ నుంచే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
FIFA World Cup Final 2026 | భవిష్యత్తులో భారత జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతుందని, జట్టులో తెలంగాణ ఆటగాళ్లు ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

- భారత జట్టు ప్రపంచకప్ ఆడి, తెలంగాణా నుండీ స్టార్ ఆటగాళ్లు వస్తారన్నారు.
CM Revanth Reddy | నాలుగేళ్లకు ఓసారి జరిగే ఫిఫా వరల్డ్ కప్ సంగ్రామం క్లైమాక్స్‌కు చేరుకుంది. నేటి అర్దరాత్రి ప్రారంభం కానున్న ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడుతోంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనకున్న క్రీడాభిమానాన్ని, ముఖ్యంగా ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువను పంచుకున్నారు.
తాను క్రీడలను విపరీతంగా ఇష్టపడే వ్యక్తినని, ఫుట్‌బాల్ ప్రేమికుడినని ఆయన పేర్కొన్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం, గోట్ (GOAT) అని పిలుచుకునే లియోనెల్ మెస్సీని గతంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చి, ఇక్కడి తెలంగాణ పిల్లలతో కలిసి ఆయన మైదానాన్ని పంచుకునేలా చేసిన ఆ రోజు తనకు ఎంతో ఇష్టమైన క్షణమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
అయితే, తాను ఫిఫా వరల్డ్ కప్‌నకు మద్దతు ఇవ్వడం వెనుక కేవలం క్రీడాభిమానమే కాకుండా, అంతకంటే ముఖ్యమైన ఉద్దేశం.. ఒక గొప్ప విజన్ దాగి ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒకరోజు భారత ఫుట్‌బాల్ జట్టు ఖచ్చితంగా ప్రపంచకప్ ఫైనల్స్ ఆడుతుందని, అంతేకాకుండా భారత్ ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుందని, తనకు నమ్మకం ఉందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Most of you know I am a die-hard sports and a #football lover. I loved the day we could bring GOAT #Messi to #Hyderabad to share the pitch with children of Telangana.
— Revanth Reddy (@revanth_anumula) July 19, 2026
But there is a deeper purpose and vision for my support of the FIFA World Cup.
I am convinced one day… pic.twitter.com/3vfoQ6i1pb
భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్ స్థాయికి చేరినప్పుడు, ఆ జట్టులో మెరవబోయే భవిష్యత్తు స్టార్ ఆటగాళ్లలో పలువురు మన తెలంగాణ గడ్డ నుంచే ఉంటారని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలని పేర్కొంటూ, ఫుట్‌బాల్ అభిమానులకు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్ 2026 వేడుకను ఆస్వాదించాల్సిందిగా శుభాకాంక్షలు తెలిపారు.
Frequently Asked Questions
భవిష్యత్తు భారత ఫుట్‌బాల్ జట్టుకు తెలంగాణ నుండి ఎలాంటి సహకారం ఉంటుందని సీఎం భావిస్తున్నారు?
ట్రెండింగ్ వార్తలు






















