అన్వేషించండి

Telangana Cabinet Decisions 2026: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!

Dharani Portal Forensic Audit: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్‌పై ఫోరెన్సిక్ ఆడిట్, బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పులకు ఆమోదం తెలిపింది.

Telangana Panchayat Raj Act 2018 Amendment: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం  రాష్ట్ర కేబినెట్ అత్యంత కీలక సమావేశం నిర్వహించింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో భూ పరిపాలన, మౌలిక వసతుల కల్పన, ఉపాధి,   సంక్షేమ రంగాలకు సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రగతి గమనాన్ని మార్చే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నుంచి పల్లెల్లో పాలనా సంస్కరణల వరకు పలు కీలక బిల్లులు, ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్                           

ఈ కేబినెట్ నిర్ణయాల్లో అన్నింటికంటే ప్రధానమైనది ధరణి పోర్టల్‌పై తీసుకున్న నిర్ణయం. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలతో, దీనిపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్‌కు కేబినెట్ ఆదేశించింది. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని లోతుగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా భూ రికార్డుల అవకతవకలకు బాధ్యులైన వారిని గుర్తించి, బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది.

బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్‌లో మార్పులు                    

మౌలిక సదుపాయాల రంగంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌మెంట్‌లో మార్పులకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు రూట్లలో భూసేకరణ వ్యయాన్ని తగ్గించేందుకు, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా స్టేషన్ల స్థానాల్లో, అలైన్‌మెంట్‌లో కొన్ని సాంకేతిక మార్పులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, వీటికి కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మార్పుల ద్వారా ప్రాజెక్టు వ్యయం తగ్గడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రైల్వే హబ్‌ను అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది.

పలు కీలక నిర్ణయాలు

పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పటాన్‌చెరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి మరియు అర్హులకు కేటాయించడానికి కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. అదేవిధంగా విద్యా రంగానికి ఊతమిస్తూ జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పలు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా స్థానిక విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా  తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణలకు కేబినెట్ ఓకే చెప్పింది. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, సర్పంచుల అధికారాల పరిధిని మరింత సులభతరం చేసే విధంగా ఈ సవరణల ముసాయిదాను రూపొందించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.                 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget