News
News
X

YS Jagan : కుప్పం అభ్యర్థి భరతే - ఈ సారి వైఎస్ఆర్‌సీపీ గెలిచి తీరాలని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం !

కుప్పంలో ఈ సారి భరత్‌ను గెలిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కుప్పంలో ఈ సారి వైఎస్ఆర్‌సీపీ గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

FOLLOW US: 

YS Jagan :   కుప్పం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా భరతే ఉంటారని జగన్ ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను కుప్పం నుంచి ప్రారంభించారు. బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పం నుంచి బీసీ వర్గానికి చెందిన చంద్రమోళిని ప్రోత్సాహించామన్నారు. ఆయన చనిపోవడంతో ఆయన కుమారుడ్ని ప్రోత్సహిస్తున్నానన్నారు.   భరత్‌ను గెలుపించుకు వస్తే మంత్రిని కుప్పానికి ఇస్తానన్నారు.   నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారని అందుకే వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చిందన్నారు. 

చంద్రబాబు హయాంలో కన్నా ఎక్కువ అభివృద్ధి 

అయితే  చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని జగన్ కార్యకర్తలకు గుర్తు చేశారు.  స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్లపట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్‌ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదన్నారు. ఇప్పుడు ఇవన్నీ మన కళ్ల ముందే ఉన్నయన్నారు. సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధికన్నా.. ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోందన్నారు.  వచ్చే రెండు రోజుల్లో కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. 

ఆ వీడియోపై విచారణ - నిజమైతే ఎంపీపై చర్యలుంటాయన్న సజ్జల ! '

భరత్‌ అడిగాడు, జగన్‌గా నేను చేయిస్తున్నాను 

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పని జరుగుతూ ఉందని జగన్ స్పష్టం చేశారు. సంవత్సరంలోపు దాన్ని పూర్తిచేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తానన్నారు.  గతంలో కుప్పం గెలుస్తామా? అంటే  ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని అద్భుతాలు జరిగాయన్నారు. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  ఘనవిజయాలు నమోదు చేశామన్నారు. ఇవాళ ఇంత మంచిచేస్తున్న ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని...గడపగడపకూ  పథకాలన్నీ అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారన్నారు. 

వైఎస్ జగన్ బయోపిక్ చేయడానికి రెడీ - దుల్కర్ సల్మాన్ కామెంట్స్!

రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతుంది  

రాజకీయనాయకుడిగా మనకు ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే.. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు వస్తుందని జగన్ తెలిపారు. ఇవాళ కాలర్‌ ఎగరేసుకుని... మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నామని.. ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీదేనని కార్యకర్తలకు సూచించారు.  175కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పంనుంచే ప్రారంభం కావాలన్నారు.  మీ భుజస్కంధాలమీద ఈ బాధ్యతను పెడుతున్నాననని  రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కుప్పం నేతలకు జగన్ సూచించారు. 

Published at : 04 Aug 2022 08:24 PM (IST) Tags: YSRCP jagan Kuppam Review of Kuppam

సంబంధిత కథనాలు

Rajinikanth as Governor:   రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ !  బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Desh Ki Neta : దేశ్‌ కీ నేత రేసులో కేజ్రీవాల్ - దేశవ్యాప్తంగా పర్యటనలకు రెడీ !

Desh Ki Neta :  దేశ్‌ కీ నేత రేసులో కేజ్రీవాల్ - దేశవ్యాప్తంగా పర్యటనలకు రెడీ !

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?

Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !

Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు