అన్వేషించండి

Chandrababu : వాలంటీర్లకు రూ. 50వేలు ఆదాయం వచ్చేలా చేస్తా - చంద్రబాబు భరోసా !

Andhra News : వైసీపీ చెప్పినట్లుగా చేస్తే వాలంటీర్లు జైలుకు వెళ్తారని చంద్రబాబు హెచ్చరించారు. నీతి నిజాయితీగా ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూ.30 నుంచి రూ. 50వేల జీతం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Chandrababu At Kuppam :  వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. . వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వారి జీవితాలు మారుస్తామన్నారు. వారు నీతి, నిజాయితీగా ఉండాలని . వైసీపీ చెప్పిన పనులు చేస్తే మాత్రం జైలుకెళ్తారని హెచ్చరించారు. కుప్పంలో యువతతో చంద్రబాబు సమావేశం అయ్యారు.  తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.

 టీడీపీ అధికారంలోకి రాగానే 60  రోజుల్లో మెగా డీఎస్సీ               

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతతో భేటీ అయ్యారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని సీఎం వైఎస్ జగన్ యువతను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రం డీఎస్సీ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్‌-1 ఉద్యోగాలను నచ్చినవారికి ఇచ్చుకున్నారని ఆరోపించారు.

ఏపీని కాపాడుకునేందుకే పొత్తులు                         

ఏపీని కాాపాడుకునేందుకు పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.  వైసీపీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సర్వే నంబర్స్ మార్చి ప్రజల భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గం కప్పుంలోనూ తనకు బెదిరింపులు తప్పటం లేదన్నారు. ఇక ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. ఏపీలో ఖనిజ సంపదను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని మండిపడ్డారు. ఇలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వంద రోజుల్జేలో   బ్రాండ్ మద్య నిషేధం                         

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలతో కొత్తదారి చూపించానని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్రమార్కుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు. పారదర్శకంగా జరగాల్సిన పాలనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. టెండర్స్ లోనూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో విస్తృతంగా పర్యటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget