KTR: 'ఎన్నికల ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేసేదొకటి' - సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
KTR Slams Cm Revnath Reddy: సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ఎన్నికల ముందు చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. రైతుల పంట రుణాలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు మాట తప్పిందని.. అన్నదాతలకు లీగల్ నోటీసులు పంపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. 'బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు. కానీ, నేడు పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలు.👇
— KTR (@KTRBRS) March 24, 2024
▶️బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు.
▶️డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం.
▶️ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా… pic.twitter.com/hxKapf2DYW
ఆ యూట్యూబ్ ఛానళ్లకు వార్నింగ్
అటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో పూర్తి అబద్ధాలు చూపిస్తున్నాయని అన్నారు. చట్ట విరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇది బీఆర్ఎస్ పార్టీని, వ్యక్తిగతంగా తనను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నట్లు భావిస్తున్నామని.. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమపై అసత్య ప్రచారాలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు. అడ్డగోలు థంబ్ నెయిల్స్ పెట్టి అసత్యాలు ప్రచారం చేసే అలాంటి ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేయడం సహా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు…
— KTR (@KTRBRS) March 24, 2024
Also Read: Be Alert: డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్, రూ.31 లక్షలు దోపిడీ! సజ్జనార్ కీలక సూచనలివే