అన్వేషించండి

BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

BRS: తిరుగులేని శక్తిగా వెలిగిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అంతర్గత పరిణామాలు కూడా రోజు రోజుకు ముదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

BRS Party Internal Crisis: తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి  ఉడికీ ఉడకని  చందంగా తయారైంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు నిర్మించడంలో పార్టీ విఫలమవుతోందనే వాదన క్యాడర్‌లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న సమయంలో, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలకు, సోషల్ మీడియా వేదికగా సాగే మాటల యుద్ధానికే కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల పార్టీకి ఆశించిన మైలేజీ రావడం లేదని   అభిప్రాయపడుతున్నారు.

 హరీష్ రావు వైపు చూపు 

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ముందుండే  ట్రబుల్ షూటర్ హరీష్ రావు పాత్ర ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలన్నా, చెల్లాచెదురవుతున్న క్యాడర్‌ను ఏకం చేయాలన్నా హరీష్ రావుకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని మెజారిటీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే, పార్టీలో కేటీఆర్ వర్గానికి, హరీష్ వర్గానికి మధ్య సాగుతున్న  కోల్డ్ వార్  వల్ల ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి హరీష్ అనుచరుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

 వివాదాలకు దూరంగా.. అమెరికా పయనం 

ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విషయంలో బీఆర్ఎస్ అనుసరించిన వైఖరి పార్టీలో చీలికను తెచ్చింది. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగత అంశాలను అస్త్రంగా చేసుకోవడం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుందని హరీష్ రావు భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఆ విషయంలో ఆయన మౌనం వహించడమే కాకుండా, తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకల పేరుతో అమెరికా పయనమయ్యారు. రాజకీయ సెగలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్లడం, అది కూడా కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటానని చెప్పడం వెనుక  వ్యూహాత్మక మౌనం  ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.  ఒకప్పుడు కేసీఆర్ మాటే శాసనంగా నడిచిన పార్టీలో, ఇప్పుడు నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కేటీఆర్ శైలి కేవలం పట్టణ ఓటర్లను, సోషల్ మీడియాను ఆకట్టుకునేలా ఉందే తప్ప, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ అనిశ్చితిని గమనిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తోంది.

 సోషల్ మీడియా వార్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ 

బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కేవలం ప్రత్యర్థులను ట్రోల్ చేయడానికే పరిమితమైందని, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునే కార్యాచరణ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.  చెబుతున్నారు. హరీష్ రావు అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే పార్టీలో అసలు రంగు బయటపడుతుందని భావిస్తున్నారు. ఆయన తిరిగి వచ్చాక పార్టీ పగ్గాల్లో మార్పులు ఉంటాయా? లేక ఆయన తన దారి తాను చూసుకుంటారా? అనే చర్చ ఇప్పుడు వెబ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఇప్పుడు ఒక కూడలిలో నిలబడింది. కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగి నాయకత్వ మార్పులపై స్పష్టత ఇస్తే తప్ప, గందరగోళంలో ఉన్న క్యాడర్‌ను గట్టెక్కించడం కష్టమేనని కనిపిస్తోంది. అమెరికా నుంచి హరీష్ రావు తిరిగి వచ్చేలోపు తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget