News
News
X

BJP Task : ఈ ఏడాదే బీజేపీకి అసలైన సవాల్ - అందులో తెలంగాణ ఒకటి ! తేడా వస్తే హ్యాట్రిక్ మిస్సవుతుందా ?

ఈ ఏడాది బీజేపీకి అసలైన సవాల్ ఎదురు కానుంది. ఆ చాలెంజ్ ఎలా ఎదుర్కోవాలన్నదానిపై బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో వ్యూహం రచిస్తున్నారు.

FOLLOW US: 
Share:

BJP Task :  దేశంలో తిరుగులేని రాజకీయ పార్టీగా మారిన భారతీయ జనతా పార్టీ 2023 అత్యంత క్లిష్టమైన సవాల్ విసరబోతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీ తన ప్రభావం తగ్గలేదని.. కమలం వాడిపోలేదని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెమీ ఫైనల్స్ లాంటి ఎన్నికలు ఈ ఏడాదే జరగబోతున్నాయి. దీంతో ఆ పార్టీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతోంది.  వ్యూహప్రతి వ్యూహాలు రెడీ చేసుకుంటోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న కార్యవర్గ సమావేశాల్లో కూడా ఎన్నికల్లో ఎలా గెలవాలన్నదేదానిపైనే మేథోమథనం చేస్తున్నారు. 

ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 

ఈ ఒక్క ఏడాదే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  తెలంగాణ తో పాటు కర్నాటక  , రాజస్థాన్- , మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్  , త్రిపుర  , మేఘాలయా , నాగాలాండ్  , మిజోరాం లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబరు, డిసెంబర్‌లో   మిజోరం  .   రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. 2024 మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో.. ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.

ఏ రాష్ట్రంలో అధికారం చేజారినా మైనస్సే !

ప్రస్తుతం బీజేపీ అత్యంత బలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే  కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ , తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో కాంగ్రెస్అధికారంలో ఉంది.  ఇప్పుడు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు కొత్త రాష్ట్రాలను చేజిక్కించుకోవాలి. పొరపాటున ఒక్క రాష్ట్రం కోల్పోయినా ఇబ్బందికరమే. తెలంగాణలో కూడా హాట్ ఫేవరేట్లుగా ఉన్నామని.. గెలిచి తీరుతామని అంటున్నారు. ఎక్కడ నిరాశజనక ఫలితాలొచ్చినా ఆ ఎఫెక్ట్ వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది. 

బూత్ స్థాయిలో బలోపేతంపై బీజేపీ  దృష్టి ! 

ఢిల్లీలో జరుగుతున్న కార్యవర్గ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలన్నదానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు.  2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఈ సమావేశాల్లో మెగా ప్లాన్ సిద్ధం చేయనున్నారు. దేశం నలుమూలల నుంచీ ప్రతినిధులు రావడంతో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ పార్టీ ప్రస్తుత పరిస్థితిపై లోతుగా చర్చించేలా ప్లాన్ చేసుకున్నారు. బలహీనతలు అధిగమిస్తూ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకంటున్నారు.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరోమారు సొంతంగా అధికారంలో వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేకపోయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. మెగా ప్లాన్ రూపొందిస్తారు.

అగ్రనేతలంతా హాజరు !

కేంద్రంలో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమలనాథులు రాజకీయ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఈ సమావేశాలకు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది ముఖ్యమంత్రులు, ఐదుగురు డిప్యూటీ సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, 19 మంది మాజీ ముఖ్యమంత్రులు, 12 మంది మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రులతో సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

Published at : 17 Jan 2023 07:00 AM (IST) Tags: BJP JP Nadda 9 state assembly elections 2023 election year

సంబంధిత కథనాలు

నెల్లూరు రోడ్లపై ఈడ్చికెళ్తా- కోటం రెడ్డికి ఫోన్‌లో వార్నింగ్- విన్నోళ్లకు బూతులు బోనస్‌!

నెల్లూరు రోడ్లపై ఈడ్చికెళ్తా- కోటం రెడ్డికి ఫోన్‌లో వార్నింగ్- విన్నోళ్లకు బూతులు బోనస్‌!

KCR Vs Tamilsai : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్‌పై కేసీఆర్ సైలెన్స్ ! తెలంగాణ రాజకీయాలు మారిపోయాయా ?

KCR Vs Tamilsai : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్‌పై కేసీఆర్ సైలెన్స్ ! తెలంగాణ రాజకీయాలు మారిపోయాయా ?

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

టాప్ స్టోరీస్

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!