News
News
X

తెలుగుదేశంలో కన్నా చేరడానికి కారణాలేంటీ? జనసేనను ఎందుకు వద్దనుకున్నారు?

బీజేపికి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 23న చేరుతున్నట్లుగా సన్నిహితుల వద్ద ప్రస్తావించారు.

FOLLOW US: 
Share:

రాజకీయాల్లో సీనియర్‌గానే గుర్తింపు పొందిన కన్నా లక్ష్మినారాయణ బీజేపికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజుతో కన్నా విభేదించారు. దీంతో బహిరంగగానే కన్నా సొము వీర్రాజును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా పార్టీ నాయకత్వం కన్నా వ్యాఖ్యలను అసలు పట్టించుకోలేదు. అదిష్ఠానం ఈ విషయంపై ప్రత్యేకంగా వివరాలను అడిగి తెలుసుకున్నప్పటికి కన్నాకు కౌంటర్‌గా కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. అంతే కాదు కనీసం కన్నా ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు కూడా పార్టీ నేతలు ప్రయత్నించలేదు. కన్నాను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు ఎవ్వరూ ప్రయత్నించలేదు. దీంతో చివరకు కన్నా పార్టీకి రాజీనామా చేయాలని భావించారు. అందులో భాగంగానే కన్నా లక్ష్మి నారాయణ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఈనెల 16వ తేదీన కన్నా పార్టి నాయకులతో గుంటూరులోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఆ తరువాత పార్టీకి రాజీనామా చేశారు.

కనీసం పలకరించని బీజేపి నేతలు...
రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వివాదరహితుడిగా, స్ట్రాంగ్ పాలిటిక్స్‌ను నడిపే వ్యక్తిగా కన్నా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కన్నా రాజీనామా చేసిన తరువాత ఆ పార్టికి చెందిన నాయకత్వం కనీసం పలకరించలేదు.

‘‘సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే పార్టీని వీడుతున్నా. ఆయన వల్లే పార్టీలో ఇమడలేకపోయా. పార్టీతో చర్చించకుండా జీవీఎల్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రంగా పేరు క్రిష్ణా జిల్లాకు పెట్టాలని గతంలోనే ఉద్యమం చేశాం. అప్పుడే జీవీఎల్ ఉద్యమంలో పాల్గొంటే బాగుండేది. కొందరు ఓవర్ నైట్ స్టార్ నేత కావాలని ప్రయత్నిస్తున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పార్టీలో పరిస్థితులు మారాయి’’

-కన్నా లక్ష్మీ నారాయణ

రాష్ట్ర అధ్యక్షుడిని సైతం, ధిక్కరించి మాట్లాడినప్పుడు కూడా కన్నా అలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనే విషయంపై నేతలు కనీసం ఆరా తీయలేదు. దీంతో కన్నా తీవ్ర మనస్దాపానికి గురయ్యారని అంటున్నారు. పార్టీలో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్న సీనియర్ నేతను భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకత్వం ఎందుకు పట్టించుకోలేదనే దానిపై కూడా చర్చ జరుగుతుంది.

23న టీడీపీలోకి కన్నా.....
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తరువాత కూడా కన్నా రెండు రోజులపాటు సైలెంగా ఉన్నారు. తన అభిమానులు, అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా తనపై ఉన్న అభిమానంతో తనతోపాటే నడుస్తున్న క్యాడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత తెలుగు దేశం పార్టీలో చేరాలని, మెజార్టీ అభిమానులు కన్నా వద్ద ప్రస్తావించారని చెబుతున్నారు. జనసేనలోకి వెళ్ళాలంటే, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నందున, తెలుగు దేశం పార్టీనే ఫైనల్ అని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే తారకత్న చనిపోవటంతో ఇప్పుడే ఆ విషయాన్ని ప్రకటించటంలేదని కన్నా అనుచరులు వెల్లడించారు. 23వ తేదీన డేట్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే మంతనాలు జరిగాయని లోకేష్ పాదయాత్ర కూడా జరుగుతున్న తరుణంలో కన్నా పార్టీలో చేరటం ద్వార తెలుగు దేశం మరింత బలోపేతం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. 

Published at : 20 Feb 2023 10:56 AM (IST) Tags: AP Politics Gunturu Politics TDP Kanna Lakshmi Narayana ap updates

సంబంధిత కథనాలు

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!