అన్వేషించండి

తనను ఐరన్ లెగ్ వారిపై రివైంజ్ తీర్చుకుంటున్న మంత్రి రోజా

తనను ఐరన్‌ లెగ్‌ అని హేళన చేసిన టిడిపికి అదేస్టైల్లో పంచ్‌లేశారు మంత్రి రోజా. ఆ బాబు ఎక్కడ  లెగ్‌ పెడితే అక్కడ ప్రాణాలు పోతాయి, చిన్నబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ తండ్రికి చిక్కులేనంటూ సటైర్లు వేశారు.

అమ్మో ఆయన కాలు పెడితే ఇంకేమైనా ఉందా? ఒక్కసారి మీరూ ఆలోచించండి అని వైసీపీ నేతలు మరోసారి సెంటిమెంట్‌ని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ ఎవరి గురించి అంటే టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్‌ గురించేనంటున్నారు. తండ్రీ కుమారులు ఎక్కడ లెగ్‌ పెడితే అక్కడ భస్మమేనని పదేపదే నొక్కి చెబుతున్నారు. 

టిడిపి అధినేత చంద్రబాబు రోడ్‌ షోల్లో అపశృతి జరగడం ఆపార్టీని కలవరపెడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ నిర్వహిస్తోన్న పలు కార్యక్రమాలు ఎన్నికల ప్రచారాలను తలపించేలా సాగుతున్నాయి. ఈ క్రమంలో భారీగా టిడిపి అభిమానులు, ప్రజలు వస్తున్నారు. చాలా రోడ్‌ షోల్లో తోపులాటలు, ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఈ తరహా షోలకు అనుమతి నిరాకరించినప్పటికీ కోర్టుల పర్మిషన్‌తో బాబు జిల్లా పర్యటనలు, రోడ్‌షోలు కొనసాగాయి. ఈ క్రమంలోనే కందుకూరులో జరిగిన రోడ్‌ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో ఓ ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలోనూ తోపులాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలపై అధికారపార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ తమదైన స్టైల్లో విమర్శలు చేసింది.

ఒకప్పుడు తనని ఐరన్‌ లెగ్‌ అని అవహేళన చేసిన టిడిపిని అదే స్టైల్లో పంచ్‌ ఇచ్చారు మంత్రి రోజా. ఆ బాబు ఎక్కడ లెగ్‌ పెడితే అక్కడ ప్రాణాలు పోతాయని ఈ చిన్నబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ తండ్రికి చిక్కులేనని చెబుతూ ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ ఎమ్మెల్సీగా సభలోకి అడుగుపెట్టగానే ఓటుకునోటు కేసులో చంద్రబాబుకి నోటీసులు వచ్చాయని గుర్తు చేశారు. అలా ఇద్దరిదీ ఐరెన్‌ లెగ్‌ అని సెటైర్లు వేశారు.

మరో మంత్రి అంబటి కూడా చంద్రబాబు పాదం మాములది కాదన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అన్న పేరుని పెట్టినప్పుడు ఆపార్టీ నేతలే వద్దన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఖర్మే టిడిపికి చుట్టుకుందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొడాలి అయితే దశమ గ్రహంతో చంద్రబాబుని పోల్చారు. ఇలా ఏపీ మంత్రులతోపాటు జగన్‌ కూడా బాబు పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని మరోసారి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటని గుర్తు చేశారు.

ఇలా వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా టిడిపి పార్టీపై ఐరన్‌ లెగ్ సెంటిమెంట్‌ ముద్ర వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. పనిలోపనిగా టిడిపికి మద్దతుగా ఉన్న జనసేన పార్టీని కూడా కలిసొచ్చేలా విమర్శలు చేస్తోంది. రోడ్‌ షోలతో ప్రాణాలు తీస్తోన్న చంద్రబాబుపై ఎందుకు పవన్‌ కల్యాణ్‌ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని నిలదీస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
Khairatabad Bypoll Janasena: ఖైరతాబాద్ ఉపఎన్నిక - జనసేన పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఖైరతాబాద్ ఉపఎన్నిక - జనసేన పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget